Gautam Gambhir : ఇక గంభీర్ ఆటలు సాగవా ? ఫామ్‌లో ఉన్న వారిని విస్మరించడం పై బీసీసీఐ సీరియస్
Gautam Gambhir : ప్రస్తుతం భారత టీ20 జట్టు ఎంపికలో నిలకడ లేదనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ టాలెంటెడ్, ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను పట్టించుకోకుండా తనకు నచ్చిన ఆటగాళ్లకు మాత్రమే ప్లేయింగ్ 11 లో ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

Gautam Gambhir : ప్రస్తుతం భారత టీ20 జట్టు ఎంపికలో నిలకడ లేదనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ టాలెంటెడ్, ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను పట్టించుకోకుండా తనకు నచ్చిన ఆటగాళ్లకు మాత్రమే ప్లేయింగ్ 11 లో ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై బీసీసీఐ అధికారులు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం.
గంభీర్ ఎంపికలో అత్యంత వివాదాస్పదంగా మారిన అంశం… సంజు సామ్సన్ లాంటి టాలెంట్ పక్కన పెట్టడం. సంజూ సామ్సన్ 2024 లో వరుసగా 3 సెంచరీలు సాధించి మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ, అతనికి నిరంతరం అన్యాయం జరుగుతోందని విమర్శకులు అంటున్నారు. దీనికి విరుద్ధంగా గత 21 టీ20 ఇన్నింగ్స్‌లలో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయని శుభ్‌మన్ గిల్‌కు మాత్రం నిరంతరం ఓపెనర్‌గా అవకాశాలు ఇస్తున్నారు. దీని వెనుక… 2026 టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టుకు మూడు ఫార్మాట్‌లకు ఒకే కెప్టెన్‌ను నియమించాలనే బీసీసీఐ ఆలోచన ఉండవచ్చని సమాచారం.
బ్యాట్స్‌మెన్ల ఎంపిక మాత్రమే కాక, బౌలర్ల ఎంపికపైనా విమర్శలు వస్తున్నాయి. యువ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ఆస్ట్రేలియా సిరీస్, ఆసియా కప్ వంటి ముఖ్యమైన మ్యాచ్‌లలో పక్కన పెట్టి, అతని స్థానంలో హర్షిత్ రాణాకు నిరంతరం అవకాశాలు ఇచ్చారు. హర్షిత్ రాణా నిలకడగా ఎక్కువ పరుగులు ఇచ్చినా, అర్ష్‌దీప్‌ను కేవలం బ్యాకప్ బౌలర్‌గా మాత్రమే ఉపయోగించడంపై బీసీసీఐ అధికారులు గంభీర్‌ను సూటిగా ప్రశ్నించారు. ఫామ్‌లో ఉన్న అర్ష్‌దీప్‌ను పక్కన పెట్టడం చాలా చెత్త సెలక్షన్ అని ఒక బీసీసీఐ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సుదీర్ఘ విరామం తర్వాత సౌతాఫ్రికా సిరీస్‌లో అర్ష్‌దీప్‌ను ఆడిస్తున్నా, అతను పవర్‌ప్లేలో బాగా వేసినా, ఆ తర్వాత ఇబ్బంది పడుతున్నాడు. ఫామ్‌లో ఉన్నప్పుడు అతనికి ఇచ్చిన విరామమే ఈ సమస్యకు కారణమని భావిస్తున్నారు. ఈ కారణాలన్నీ దృష్టిలో ఉంచుకుని, ఒకవేళ టీమిండియా సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను కోల్పోతే, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ చూడండి




