బిగ్ బాస్ ఫైనలిస్ట్ రేసులో సుమన్ శెట్టి, డీమాన్ పవన్ తప్పుకున్నారు. డీమాన్ పవన్ తన పాయింట్లను తనూజకు ఇవ్వడంతో, ఆమె మొదటి స్థానానికి దూసుకెళ్లింది. తదుపరి ఎలిమినేషన్ కోసం ఇంటి సభ్యులు ఒకరిని తొలగించాలని బిగ్ బాస్ ఆదేశించాడు. దీనిపై భరణి తనూజను అడగ్గా, ఆమె నిర్మొహమాటంగా మీరు అని చెప్పి అతన్ని షాక్కు గురిచేసింది.