Rajinikanth: రజినీకాంత్ కోసం 7 రోజులు ఉపవాసం ఉన్న స్టార్ హీరోయిన్.. ఎందుకంటే..
సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి దక్షిణాదిలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రజినీ. ఏడు పదుల వయసులోనూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈరోజు రజినీ బర్త్ డే సందర్భంగా సినీప్రముఖులు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు.

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఒకప్పుడు సాధారణ బస్ కండక్టర్.. ఇప్పుడు కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఏడు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించారు. ప్రస్తుతం జైలర్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈరోజు (డిసెంబర్ 12న) రజినీకాంత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో సినీప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అయితే మీకు తెలుసా.. ? ఒకప్పుడు రజినీకాంత్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ఏకంగా 7 రోజులు ఉపవాసం ఉన్నారట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే దివంగత హీరోయిన్ శ్రీదేవి.
ఇవి కూడా చదవండి : Actress Vahini : అప్పుడు సీరియల్స్‌తో క్రేజ్.. క్యాన్సర్‌తో పోరాటం.. సాయం కోరుతూ పోస్ట్..
సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు శ్రీదేవి. బాలనటిగా తెరంగేట్రం చేసి ఆ తర్వాత కథానాయికగా ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. స్క్రీన్ పైనే కాకుండా రియల్ లైఫ్ లో సినీ పరిశ్రమలో పలువురు స్టార్స్ స్నేహితులుగా కొనసాగారు. అందులో శ్రీదేవి, రజినీ సైతం మంచి స్నేహితులు. వీరిద్దరు కలిసి దాదాపు 20 సినిమాల్లో నటించారు. అయితే ఒక సమయంలో రజినీకాంత్ అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఆయన కోసం శ్రీదేవి ఏడు రోజులు ఉపవాసం ఉన్నారట. 2011లో రజినీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా.. ఆయన ఆరోగ్యం కోసం త్వరగా కోలుకోవాలని షిర్డీ సాయి బాబా పేరు మీద ఉపవాసం ఉన్నారట.

Rajini, Sridevi
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..
రజినీ, శ్రీదేవి కలిసి అనేక హిట్ చిత్రాల్లో నటించారు. అలాగే రజినీతో కలిసి మొదటి సినిమా చేసిన సమయంలో శ్రీదేవి వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. ప్రస్తుతం రజినీ జైలర్ 2 సినిమాలో నటిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.
ఇవి కూడా చదవండి : Tollywood : అలాంటి సీన్స్ చేయడానికి ఓకే.. కానీ లిప్ లాక్ అతడికి మాత్రమే.. టాలీవుడ్ హీరోయిన్..




