“ఇదే కొనసాగితే, మూడవ ప్రపంచ యుద్ధం మొదలవుతుంది..” పుతిన్‌కు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్!
రష్యా-ఉక్రెయిన్ వివాదం మూడవ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వైట్ హౌస్ ప్రెస్ మీటింగ్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత నెలలోనే ఈ యుద్ధంలో 25,000 మంది మరణించారని, వారిలో ఎక్కువ మంది సైనిక సిబ్బంది ఉన్నారని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. రష్యా- ఉక్రెయిన్ వివాదంలో జరిగిన మరణాలకు ఆయన సంతాపం తెలిపారు.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని వెంటనే ఆపాలని పిలుపునిస్తూ , “ఇక్కడ హత్యలు ఆగిపోవాలని కోరుకుంటున్నాను. గత నెలలో దాదాపు 25,000 మంది సైనికులు మరణించారు. దానిని ఆపడానికి మేము తీవ్రంగా కృషి చేస్తున్నాము. ఇలాంటివి చివరికి మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయి. ప్రతి ఒక్కరూ ఇలాంటి ఆటలు ఆడుతున్నంత కాలం, మనం చివరికి మూడవ ప్రపంచ యుద్ధంలో ముగుస్తాం, మనం దానిని చూడకూడదని చెప్పాను. ” అని ట్రంప్ పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కాల్పుల విరమణ గురించి గొప్పలు చెప్పుకునే ట్రంప్ , రష్యా- ఉక్రెయిన్ వివాదాన్ని దూరం నుండి చూడవలసి వస్తుంది. ఎందుకంటే రెండు దేశాలు వెనక్కి తగ్గడానికి ఇష్టపడటం లేదు. అంతకుముందు, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ, రష్యా – ఉక్రెయిన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించకపోవడంతో ట్రంప్ తీవ్ర నిరాశకు గురయ్యారని అన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, కరోలిన్ లెవిట్.. “ఈ యుద్ధంలో ఇరువైపులా వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కేవలం అధికారిక సమావేశాలతోనే ఆయన విసిగిపోయారు. ఆయనకు ఇక చర్చలు అక్కర్లేదు. ఆయన శాంతిని కోరుకుంటున్నారు. ఈ యుద్ధం ముగియాలని ఆయన కోరుకుంటున్నారు.” అని తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..