AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొండ అంచున సెల్ఫీ.. కట్‌ చేస్తే... 130 అడుగుల నుండి

కొండ అంచున సెల్ఫీ.. కట్‌ చేస్తే… 130 అడుగుల నుండి

Phani CH
|

Updated on: Dec 12, 2025 | 6:30 PM

Share

చైనాలోని హువాయింగ్ పర్వతంపై బ్లేడ్ రాక్ వద్ద సెల్ఫీ తీసుకుంటూ 130 అడుగుల ఎత్తు నుండి ఓ పర్యాటకుడు జారి పడ్డాడు. అదృష్టవశాత్తు, తీవ్ర గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన హైకింగ్ భద్రత, ప్రమాదకర ప్రాంతాల్లో అధికారుల హెచ్చరికల ఆవశ్యకతను తెలియజేస్తుంది. పర్వత ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

చైనాలోని గ్వాంగ్’ఆన్‌లోని హువాయింగ్ పర్వతంపై షాకింగ్ ఘటన జరిగింది. బ్లేడ్ రాక్ అనే పర్యాటక ప్రదేశంలో 130 అడుగుల కొండ శిఖరం వద్ద సెల్ఫీ తీసుకుంటూ పర్యాటకుడు జారి పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అతను ఫోన్ పట్టుకుని కొండ అంచున.. రాళ్లపై తన అడుగులు ఎక్కడ పడుతున్నాయో చూసుకుంటూ అడుగులు వేస్తున్నాడు. సెల్పీ కోసం అటు తిరిగాడు. అంతే క్షణాల్లో, అతని పాదాల కింద ఉన్న రాయి జరిగి, అదుపు తప్పి, ఠక్కున జారిపడ్డాడు. అలా కింద ఉన్న చెట్ల పొదలలోకి పడిపోయాడు. ఇది చూసి తోటి హైకర్లు దెబ్బకి షాక్‌ అయ్యారు. కేకలు పెడుతూ కొండ అంచున పరుగులు పెట్టారు. కానీ పడిపోయిన వ్యక్తి అడవిలో పడ్డాడు. తీవ్రమైన గాయాలేవీ కాకుండానే జలపాతం నుంచి బయటపడ్డాడు. ఈ విషయాన్ని ఆ పర్యాటకుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ WeChatలో పోస్ట్ చేశాడు. చచ్చిపోతాననే అనుకున్నా.. కానీ ఆ పర్వత దేవతలే నన్ను ఆశీర్వదించారు. చాలా అదృష్టవంతుడిని. 40 మీటర్ల ఎత్తైన కొండపై నుండి పడి దాదాపు 15 మీటర్లు వాలుపైకి దొర్లాను అని రాసుకొచ్చాడు. మరోవైపు ప్రమాదం జరిగిందని చెబుతున్న బ్లేడ్ రాక్ hర్యాటక ప్రదేశం సుందరమైన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని “దూరం నుంచి మాత్రమే వీక్షించడానికి అనుమతి ఉంది , ఎక్కడానికి అనుమతి లేదు అని చెప్పారు అధికారులు. హైకింగ్ చేస్తున్నప్పుడు నిబంధనలను పాటించాలని, ఇలాంటి ప్రమాదకరమైన ప్రాంతాలలోకి ప్రవేశించకూడదని అధికారులు హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నన్ను చంపండి ప్లీజ్‌.. కారుణ్య మరణం కోరుకునే చీమ!

జీవితాంతం కరెంటు బిల్లు ఫ్రీ.. ఒక్కసారి పెట్టుబడితో

ఇంటి డాబాపై భారీ వేప చెట్టు..! దీని వయస్సు 100 సంవత్సరాలు

Rajinikanth: రజినీకాంత్‌ సినిమాలో పవర్‌ఫుల్‌ పాత్ర చేజార్చుకున్న ఐశ్వర్యారాయ్‌

మన ఉస్మానియాకు అంతర్జాతీయ హంగులు.. కళ్లు చెదిరే రీతిలో మాస్టర్ ప్లాన్స్