Rajinikanth: రజినీకాంత్ సినిమాలో పవర్‌ఫుల్ పాత్ర చేజార్చుకున్న ఐశ్వర్యారాయ్
సూపర్ స్టార్ రజినీకాంత్ 'నరసింహ' సీక్వెల్ రాబోతోందని అభిమానులకు శుభవార్త చెప్పారు. ఆయన 75వ పుట్టినరోజు సందర్భంగా 'నరసింహ' రీ-రిలీజ్ ప్రమోషన్స్‌లో ఈ ప్రకటన చేశారు. సీక్వెల్‌కు 'నీలాంబరి - పడయప్ప 2' అనే పేరును ఖరారు చేయగా, నీలాంబరి పాత్రకు ఐశ్వర్యారాయ్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ వార్త రజినీ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులకు ఓ అదిరిపోయే శుభవార్త చెప్పారు. తన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన నరసింహ చిత్రానికి సీక్వెల్ రాబోతోందని హింట్ ఇచ్చారు. డిసెంబరు 12న రజినీకాంత్ 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన నరసింహ మూవీ రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రీ రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా రజినీకాంత్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నరసింహా సినిమా విడుదల సమయంలో ఆడవాళ్లందరూ గేట్లు బద్దలు కొట్టిమరీ థియేటర్లలోకి వచ్చిన సినిమా చూశారని, అలాంటి సినిమా సీక్వెల్ ఎందుకు చేయకూడదు అనిపించిందని తెలిపారు. అందుకే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు. తాను చేసిన రోబో సినిమాకు సీక్వెల్ గా 2.0, జైలర్ కి జైలర్ 2 చేస్తున్నాను. అలా నరసింహ సినిమాకి కూడా రెండో భాగం ఉంటే బాగుటుంది అనిపించిందని, ఈ సినిమాకు ‘నీలాంబరి’ అనే టైటిల్ ఫిక్స్ చేశామని తెలిపారు. నీలాంబరి పాత్ర కోసం ఐశ్వర్యారాయ్ ని అనుకుంటున్నామన్నారు. నిజానికి నరసింహ కథను ముందు ఐశ్వర్యారాయ్ అనుకున్నాం. కానీ, ఆమె ఆసక్తి చూపకపోవడంతో..ఆ తరువాత శ్రీదేవి, మాధురీదీక్షిత్ కూడా అనుకున్నామని, చివరకు రమ్యకృష్ణ అయితే న్యాయం చేయగలరని డైరెక్టర్ చెప్పడంతో రమ్యను ఎంపిక చేశామని చెప్పారు. తొలి భాగంలో నీలాంబరి వచ్చే జన్మలోనైనా పగ తీర్చుకుంటానని చెబుతుంది. అందుకే ‘నీలాంబరి – పడయప్ప 2’ అనే టైటిల్‌తో కథపై చర్చిస్తున్నామని వెల్లడించారు. సినిమా బాగా వస్తే, అభిమానులకు మరో పండగే అని ఆయన వివరించారు. ఈ చిత్రానికి అసలు నిర్మాతను, కథ అందించింది కూడా తానేనని రజనీ వెల్లడించారు. ఈ ప్రకటనతో ‘నరసింహ’ సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మన ఉస్మానియాకు అంతర్జాతీయ హంగులు.. కళ్లు చెదిరే రీతిలో మాస్టర్ ప్లాన్స్
వాహనదారులకు అలర్ట్.. ఇలాంటివారికి నో పెట్రోల్
Gold Price Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
వాతావరణశాఖ అలర్ట్.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త
హిట్ కావాలంటే సినిమా వాయిదా పడాల్సిందే.. కోలీవుడ్ హీరోల నయా స్ట్రాటజీ
వాహనదారులకు అలర్ట్.. ఇలాంటివారికి నో పెట్రోల్
నలభై ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపాలు.. ఎక్కడంటే
అయ్యో .. ఇలాంటి కష్టం ఎవరికీ రావద్దు
గుండెల్ని పిండేసే ఘటన.. అలా చేయడానికి మీకు మనసు ఎలా చేశారురా
చనిపోయిందనుకున్న కుమార్తె.. రెండు నెలల తర్వాత.. ట్విస్ట్ సూపర్
ఫ్రీ గ్యాస్ కనెక్షన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి !!
ప్రభుత్వం కొత్త యాప్.. రైతు బజార్ నుంచి ఇంటికే కూరగాయలు

