వాతావరణశాఖ అలర్ట్.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోవడంతో తెలంగాణ, ఏపీల్లో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదవుతుండటంతో నీరు కూడా గడ్డకడుతోంది. వృద్ధులు, చిన్నారులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించారు.
తెలుగు రాష్ట్రంలో చలిపులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. చలి గాలుల తీవ్రత కొనసాగుతుందని.. మరో రెండు రోజులు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఉదయం, సాయంత్రం ప్రయాణం చేసే వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. వృద్ధులు, చిన్నారుల పట్ల మరింత జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆదిలాబాద్,నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌లో 6.2 డిగ్రీలు, మెదక్‌లో 7.2, హనుమకొండలో 8.6, నిజామాబాద్ 11.4, హైదరాబాద్‌లో 12.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శని,ఆదివారాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 32 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు మూడు రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇటు ఏపీని చలి వణికిస్తోంది. మరీ ముఖ్యంగా మన్యం జిల్లాలను గజగజలాడిస్తోంది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదవుతుండటంతో బయటకు రావాలంటే జంకుతున్నారు. పాడేరు, అరకులో 4 డిగ్రీల టెంపరేచర్ నమోదవ్వడంతో వాటర్ గడ్డకడుతోంది. వ్యవసాయ భూముల్లోని నీరు కూడా గడ్డ కట్టడంతో రైతులెవ్వరూ ఉదయాన్నే పొలాల వైపు వెళ్లట్లేదు. మినుములూరులో 4 డిగ్రీలు, చింతపల్లిలోనూ 5.5 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటలు దాటినా మంచు తెరలు వీడట్లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హిట్ కావాలంటే సినిమా వాయిదా పడాల్సిందే.. కోలీవుడ్ హీరోల నయా స్ట్రాటజీ
ఆ బ్యాక్‌డ్రాప్ తో సినిమా వచ్చిందంటే హిట్ పక్కా.. కాసుల వర్షం కురిపిస్తున్న సినిమాలు
Venkatesh: మళ్ళీ రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్ సెంటిమెంట్.. ఏకే 47తో రెడీ అవుతున్న వెంకీ మామా
Deepika Padukone: దీపిక మీద ఫైర్ అవుతున్న సౌత్ ఆడియన్స్.. ఎందుకు అంత కోపం ??
నలభై ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపాలు.. ఎక్కడంటే
అయ్యో .. ఇలాంటి కష్టం ఎవరికీ రావద్దు
గుండెల్ని పిండేసే ఘటన.. అలా చేయడానికి మీకు మనసు ఎలా చేశారురా
చనిపోయిందనుకున్న కుమార్తె.. రెండు నెలల తర్వాత.. ట్విస్ట్ సూపర్
ఫ్రీ గ్యాస్ కనెక్షన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి !!
ప్రభుత్వం కొత్త యాప్.. రైతు బజార్ నుంచి ఇంటికే కూరగాయలు
జూ నుంచి తప్పించుకున్న సింహం.. ఎప్పుడొచ్చి మీద పడుతుందో.. టెన్షన్

