Telangana: కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపర్చిన క్యాండిడేట్లను కాదని.. 3 అడుగుల మహిళకు పట్టం కట్టిన ఊరి జనం
సర్పంచ్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల క్యాండిడేట్లను చిత్తు చేసి.. 3 అడుగులు ఎత్తు ఉన్న స్వతంత్ర అభ్యర్థిని తిరుపతమ్మ ఘన విజయం సాధించారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలో 20 ఓట్ల తేడాతో ఆమె సర్పంచ్‌గా గెలిచి, ఊరి ప్రజల నమ్మకానికి ప్రతీకగా నిలిచారు.

సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఎవరిని హీరో చేస్తాయో.! ఎవరిని జీరోని వస్తాయో చెప్పలేం.. ఊరి జనం జై కొడితే ఎలాంటి వారికైనా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అనడానికి ఇదొక నిదర్శనం. ఆ ఊర్లో ప్రధాన రాజకీయ పార్టీలకు ఊహించని షాక్ ఇచ్చిన ఓటర్లు.. మూడు అడుగుల ఎత్తున్న మహిళను సర్పంచ్ పీఠంపై కూర్చోబెట్టారు.. స్వతంత్ర అభ్యర్థినిగా బరిలోకి దిగిన ఆ మహిళ ఇప్పుడు ఆ ఊరు సర్పంచ్‌గా పగ్గాలు చేపట్టబోతోంది.
ఊర్లో నాకు ఎదురేలేదు.. నేను ఆరడుగుల బుల్లెట్ లాంటివాన్ని అనే విర్రవీగే నాయకులకు సైలెంట్ ఓటే గుణపాఠం. ప్రజలు నిర్భయంగా ఓపు రూపంలో ఇచ్చే తీర్పు చెంపపెట్టు లాంటిది.. జనగామ జిల్లాలోని ఓ తక్కువ ఎత్తు మహిళ సర్పంచ్‌గా ఎన్నికవ్వడం ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది. జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో తిరుపతమ్మ అనే తక్కువ ఎత్తున్న మహిళ ఘన విజయం సాధించింది.. ఈ గ్రామంలో మొత్తం 1621 మంది ఓటర్లు ఉండగా సర్పంచ్ పీఠం SC రిజర్వ్ అయ్యింది.. ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన తిరుపతమ్మకు 820 ఓట్లు లభించాయి.. కాంగ్రెస్ బలపర్చిన ఇల్లందుల కటాక్షకు 800 ఓట్లు లభించాయి. బీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థిని ప్రతిభకు 170 ఓట్లు లభించాయి.. 20 ఓట్ల ఆదిత్యంతో తిరుపతమ్మ సర్పంచ్‌గా ఎన్నికయింది.
ఈ గ్రామంలో ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి.. వారి తరఫున ముఖ్య నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.. కానీ సింపుల్‌గా ప్రచారం నిర్వహించి.. ఎలాంటి ప్రలోభాలు పెట్టుకుండా.. తన ఊరు జనం మెప్పు పొందిన తిరుపతమ్మ.. సర్పంచ్‌గా ఎన్నికయింది. ఆమెకు ఊరి జనం రుణం తీర్చుకునే అవకాశం లభించింది.. వరంగల్ జిల్లాలో తిరుపతమ్మ విజయం.. ఇప్పుడు స్టేట్ వైజ్ హాట్ టాపిక్ అయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




