AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HIV Surge: ముంచుకొస్తున్న మాయదారి రోగం.. ఒక్క జిల్లాలోనే 7,400 HIV పాజిటీవ్ కేసులు!

Bihar HIV Cases : బీహార్ రాష్ట్రాన్ని ఎయిడ్స్ వ్యాధి వణికిస్తుంది. కేవలం ఒక్క జిల్లాలోనే కొన్ని రోజుల్లోనే సుమారు 7,000లకు పైగా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. అయితే బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇది శారీరకంగా కలవడంతో కాకుండా తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు ఎక్కువగా వ్యాపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ జిల్లాలో ఈ వ్యాధి వ్యాప్తికి ముఖ్య కారణం స్థానిక ప్రజల్లో అవగాహన లేకపోవడమేనని అధికారులు చెబుతున్నారు.

HIV Surge: ముంచుకొస్తున్న మాయదారి రోగం.. ఒక్క జిల్లాలోనే 7,400 HIV పాజిటీవ్ కేసులు!
Hiv Surge
Anand T
|

Updated on: Dec 12, 2025 | 4:56 PM

Share

బీహార్‌ రాష్ట్రాన్ని ఎయిడ్స్ వ్యాధి వణికిస్తుంది. రాష్ట్రంలోని సీతామర్హి జిల్లాలో ఇటీవల HIV కేసులు విపరీతంగా పెరిగాయి. కొన్ని రోజుల్లో జిల్లాలో సుమారు 7,000కు పైగా యాక్టీవ్ కేసులు నమోదయ్యాయని, ఇందులో మైనర్లు కూడా ఉన్నట్టు తెలస్తోంది. అయితే తల్లిదండ్రుల ద్వారానే ఈ వ్యాధి చిన్నారులకు సోకి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం అవగాహన లేకపోవడమేనంటున్నారు.ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజలకు సరైన అవగాహన రావడం లేదు. దీని వల్లే ఈ వ్యాధి చాలా త్వరగా వ్యాపిస్తుంది.

అయితే ఈ వ్యాధి వ్యాప్తకి ముఖ్య కారణం ఏంటని తెలుసుకునేందుకు జిల్లా హాస్పిటల్‌లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఈ ప్రమాదకర వైరల్ తల్లిదండ్రుల నుంచే చిన్నారుకు సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు ఇద్దరిలో ఎవరికి HIV ఉన్నా.. వారికి పుట్టబోయే పిల్లలకు కూడా ఆ వ్యాధి సోకే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

అయితే బీహార్ ఎయిడ్స్ నియంత్రణ కమిటీ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తుంది. ఈ సంఖ్యలు అవాస్తవమని కొట్టిపారేసింది. HIV అనేది రోగనిరోధక శక్తిని దెబ్బతీసి, ఎయిడ్స్‌కు కారణమవుతుందని, దీనికి చికిత్స ఉంది కానీ నివారణ కీలకమని పేర్కొంది, ప్రజలు ఈ వ్యాధి భారీన పడకుండా ఉండాలంటే సురక్షితమైన లైంగిక సంపర్కం, రక్త మార్పిడి విషయంలో జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.