మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్..! ఇక ఆ యాప్‌లో కూడా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు!
నవీ యూపీఐ, ఒఎన్‌డిసి భాగస్వామ్యంతో మెట్రో ప్రయాణం ఇప్పుడు పూర్తిగా డిజిటల్. యాప్‌లో క్యూఆర్ కోడ్ టిక్కెట్లు కొనుగోలు చేసి క్యూలు తప్పించుకోవచ్చు. బెంగళూరు, ఢిల్లీ, ముంబై మెట్రో ప్రయాణికులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. త్వరలో హైదరాబాద్, చెన్నై, కొచ్చిలకు విస్తరిస్తుంది.

మెట్రో ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, పూర్తిగా డిజిటల్‌గా మార్చడానికి నవీ యూపీఐ తన యాప్‌లో ఒఎన్‌డిసి (ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) సహకారంతో మెట్రో క్యూఆర్ కోడ్ టికెట్ కొనుగోలు వ్యవస్థను ప్రవేశపెట్టింది. బెంగళూరు మెట్రో కోసం క్యూఆర్ టిక్కెట్లను నవీ యాప్‌లో కొనుగోలు చేయవచ్చు. బెంగళూరు మాత్రమే కాదు ఢిల్లీ, ముంబై మెట్రో ప్రయాణికులు కూడా నవీ యుపిఐ యాప్‌లో మెట్రో టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ సౌకర్యం త్వరలో చెన్నై, హైదరాబాద్, కొచ్చి నగరాల్లో అందుబాటులోకి రానుంది.
మెట్రో ప్రయాణికులకు ఇకపై తమ మార్గాన్ని ప్లాన్ చేసుకోవడానికి, QR టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి, చెల్లింపులు చేయడానికి వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడం అనే తలనొప్పి ఉండదు. ఇవన్నీ ఒకే ప్లాట్‌ఫారమ్‌పై సాధ్యమవుతాయి. నవీ UPI యాప్‌లోని ఈ వ్యవస్థ ప్రయాణికులను క్యూలలో వేచి ఉండకుండా, మల్టీ యాప్‌లను ఉపయోగించకుండా కాపాడటమే కాకుండా, పూర్తిగా డిజిటల్ వ్యవస్థను కూడా అందిస్తుంది.
ONDC తో భాగస్వామ్యం గురించి నవీ లిమిటెడ్ MD అండ్ CEO రాజీవ్ నరేష్ మాట్లాడుతూ.. భారతదేశంలోని మెట్రో ప్రతిరోజూ కోట్లాది మందికి రవాణాను అందిస్తుంది. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ఇప్పటికీ టిక్కెట్ల కోసం క్యూలలో నిలబడాల్సి వస్తుంది. చెల్లింపు ఆలస్యం కారణంగా ప్రయాణీకుల సమయం వృధా కాకూడదు. ONDC తో కలిసి మేం ‘వన్ యాప్, వన్ QR టికెట్, వన్ సీమ్‌లెస్ ట్యాప్’ ద్వారా మెట్రో ప్రయాణాన్ని నిజంగా డిజిటల్ వ్యవస్థగా మార్చాం. ప్రతి రోజువారీ ప్రయాణీకుడికి వారి ప్రయాణాన్ని సులభతరం, వేగవంతం చేయడమే మా లక్ష్యం అని అన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
