LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓ అప్‌డేట్.. రష్యా-ఉక్రెయిన్ యుద్దం ఎఫెక్ట్ ఉంటుందా..!
LIC IPO: స్టాక్ మార్కెట్‌లో ఈ రోజుల్లో ఐపీఓ ట్రెండ్ కొనసాగుతోంది. రష్యా-ఉక్రెయిన్ వివాదం మధ్య కూడా ప్రజలు LIC IPO గురించి ఆలోచిస్తున్నారు. అదే
LIC IPO: స్టాక్ మార్కెట్‌లో ఈ రోజుల్లో ఐపీఓ ట్రెండ్ కొనసాగుతోంది. రష్యా-ఉక్రెయిన్ వివాదం మధ్య కూడా ప్రజలు LIC IPO గురించి ఆలోచిస్తున్నారు. అదే సమయంలో కొంచెం సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం దీనిపై స్పష్టమైన వైఖరిని తెలియజేసింది. LIC ఇప్పటికే IPO కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ SEBIకి పత్రాలు సమర్పించింది. మీరు కూడా LIC IPO కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇది గుడ్‌న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద IPO మార్చి 10న ప్రారంభంకాబోతుంది. LIC IPO నుంచి ప్రభుత్వం రూ.63,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఎల్‌ఐసి పాలసీ హోల్డర్లు కూడా ఈ ఐపిఓలో పెట్టుబడి పెట్టవచ్చు. ఎందుకంటే ఇందులో 10 శాతం వారికి రిజర్వ్ చేశారు. అంతేకాకుండా వారు తగ్గింపును కూడా పొందవచ్చు.
మార్కెట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కంపెనీ ఇష్యూ ధర రూ.2000-2100 మధ్య ఉండవచ్చు. మీరు కూడా LIC IPOలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ముందుగా అందుకు కొన్ని పత్రాలను సిద్ధం చేసుకోండి. LIC పాలసీ ఖాతాకు PAN, Demat ఖాతాతో లింక్ చేసుకొని ఉండాలి. మీరు ఈ రెండు పనులను ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. మీరు ఈ IPOలో పెట్టుబడి పెట్టాలనుకుంటే కొన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్‌లను తెలుసుకోవడం చాలా ముఖ్యం. LIC అంతర్గత, బాహ్య విషయాలపై అవగాహన ఉంటే మంచిది.
కరోనా సెగ ఎల్‌ఐసీకి కూడా తగిలింది. కొవిడ్ వల్ల విధించిన పరిమితుల కారణంగా LIC కార్యాచరణపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఎల్‌ఐసీ పెట్టుబడులు తగ్గగా డిసెంబర్ త్రైమాసికంలో ఎల్‌ఐసీ షేరు రికార్డు స్థాయికి దిగజారింది. కేవలం 3.67 శాతానికి పడిపోయింది. కరోనా కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ డెత్ క్లెయిమ్ ప్రయోజనాన్ని పెద్ద ఎత్తున చెల్లించాల్సి ఉంటుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో డెత్ క్లెయిమ్ మొత్తం1,71,288 మిలియన్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1,75,279 మిలియన్లు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2,39,268 మిలియన్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,17,341 మిలియన్లుగా ఉంది. దీనివల్ల సంస్ధపై భారం ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు.