- Telugu News Photo Gallery Business photos Know Why Army jet fuel is special and how this is different from jet fuel Check here all details
Army Jet Fuel: ఆర్మీ విమానాల ఇంధనం ఎందుకంత ప్రత్యేకమైనది..? సాధారణ ఇంధనానికి తేడా ఏమిటి..?
Army Jet Fuel: సైన్యంలోని ప్రతిదీ సాధారణ ప్రజలు ఉపయోగించే వస్తువులకు భిన్నంగా ఉంటుంది. ఆర్మీ ట్రక్కుల మాదిరిగానే విమానాలు కూడా విభిన్నంగా ఉంటాయి. అంతే కాదు వాటి ..
Updated on: Feb 25, 2022 | 1:26 PM

Army Jet Fuel: సైన్యంలోని ప్రతిదీ సాధారణ ప్రజలు ఉపయోగించే వస్తువులకు భిన్నంగా ఉంటుంది. ఆర్మీ ట్రక్కుల మాదిరిగానే విమానాలు కూడా విభిన్నంగా ఉంటాయి. అంతే కాదు వాటి ఇంధనం కూడా భిన్నంగా ఉంటుంది. ఆర్మీ విమానంలో ఉపయోగించే ఇంధనం సాధారణ జెట్ ఇంధనానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఆర్మీ జెట్‌లో ఏ ఇంధనంను ఉపయోగిస్తారో తెలుసుకుందాం.

విమానంలో ఉపయోగించే ఇంధనం నాలుగు రకాలుగా ఉంటుంది. జెట్ ఇంధనం, ఏవియేషన్ గ్యాసోలిన్, జెట్ బీ, బయోకెరోసిన్. కిరోసిన్-గ్యాసోలిన్ మిశ్రమం (జెట్ బి)ని మిలిటరీ జెట్‌లలో ఉపయోగిస్తారు. ఇది మిలిటరీ జెట్‌లకు ఉపయోగించే విమాన ఇంధనం. ఈ గ్రేడ్ జెట్ B, JP-4 అని కూడా పిలుస్తారు.

ఇందులో 65 శాతం గ్యాసోలిన్, 35 శాతం కిరోసిన్ ఉంటుంది. ఈ ఇంధనం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉపయోగించబడుతుంది. ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఉపయోగిస్తారు. ఈ ఇంధనం ఉపయోగం తక్కువగా ఉంటుంది.

జెట్ ఇంధనం అంటే ఏమిటి?: ఈ రకమైన ఇంధనాన్ని జెట్ A-1 రకం విమాన ఇంధనం అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా పౌర విమానయానంలో టర్బైన్ ఇంజిన్‌లకు ఉపయోగిస్తారు. ఈ ఇంధనం చాలా శుద్ధి చేయబడి ఉంటుంది. ఇది తేలికపాటి పెట్రోలియం. ఈ ఇంధనం కిరోసిన్ రకం. జెట్ A-1 38 డిగ్రీల సెంటీగ్రేడ్, -47 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద శుద్ధి చేయబడుతుంది. జెట్ ఎ అనేది అమెరికాలో మాత్రమే లభించే అదే రకమైన కిరోసిన్ ఇంధనం.





























