Subhash Goud |
Updated on: Feb 24, 2022 | 2:00 PM
Mg Motors: ఎంజి మోటార్స్ తన సెగ్మెంట్ ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతోంది. MG తన రాబోయే ఎలక్ట్రిక్ కారు గురించి టీజర్‌ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు ఈ సంవత్సరం చివరి నాటికి విడుదల అయ్యే అవకాశం ఉంది.
అయితే విడుదలైన టీజర్ నుండి ఇంకా ఎక్కువ సమాచారం వెల్లడి కాలేదు. MG రాబోయే EV పేరు MG 4 అని విడుదలైన టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ కారులో ORVMలు, బ్లాక్ ప్లాస్టిక్ బాడీ క్లాడింగ్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, బోల్డ్ షోల్డర్ లైన్లు ఉండనున్నాయి.
MG మోటార్స్ రైడర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కారును రూపొందించవచ్చు. MG మోటార్స్ భారతదేశానికి ఎలక్ట్రిక్ సెగ్మెంట్ SUVని తీసుకురానున్నట్లు గతంలో తెలియజేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు టాటా టిగోర్‌తో పోటీపడుతుంది.
MG 4 ఎలక్ట్రిక్ SUV కారు బహుశా 61.1kWh బ్యాటరీ యూనిట్లుగా ఉండే అవకాశం ఉంది. ఇందులో ఎలక్ట్రిక్ మోటార్లు గరిష్టంగా 154 hp శక్తిని, 260 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలవు. ఇది కేవలం 7 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. ఇంకా మరిన్ని అద్భుతమైన ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది.