FD Interest Rates: ప్రీమియం కస్టమర్లకు ఆ బ్యాంకు శుభవార్త.. బల్క్ డిపాజిట్లపై భారీ వడ్డీ ఆఫర్.. ఎంత ఇస్తుందంటే..?
పథకాలు వర్తించడాని ఏడాదికి కొంతమొత్తం సొమ్ము డిపాజిట్ చేయడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. బ్యాంకులు అంటే అన్ని స్థాయిల వ్యక్తుల నమ్మకం పొందాలి. అందువల్ల ధనవంతులకు కూడా ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తాయి.ముఖ్యంగా రూ.2 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు చేసే వారికి కొన్ని సదుపాయాలను బ్యాంకులు కల్పిస్తాయి.

సాధారణంగా మన పెట్టుబడికి మంచి రాబడి కోసం వివిధ పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. మామూలుగా మధ్యతరగతి ప్రజలకు అధిక వడ్డనిచ్చేలా కొన్ని పథకాలను ప్రభుత్వ మద్దతులో బ్యాంకులు, పోస్టాఫీసులు, నాన్‌బ్యాంకింగ్ సంస్థలు వివిధ పథకాలను ప్రవేశపెట్టారు. అయితే ఇలాంటి పథకాల నిర్వహణ బ్యాంకులకు కూడా పెద్ద భారమేమి కాదు. కానీ ఖాతాదారులు ఎక్కువగా ఉంటారు. అలాగే ఈ పథకాలు వర్తించడాని ఏడాదికి కొంతమొత్తం సొమ్ము డిపాజిట్ చేయడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. బ్యాంకులు అంటే అన్ని స్థాయిల వ్యక్తుల నమ్మకం పొందాలి. అందువల్ల ధనవంతులకు కూడా ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తాయి.ముఖ్యంగా రూ.2 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు చేసే వారికి కొన్ని సదుపాయాలను బ్యాంకులు కల్పిస్తాయి.
గత రెండేళ్ల నుంచి ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యల కారణంగా డిపాజిట్లపై అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లు గణనీయంగా పెంచాయి. అయితే ఈ పెంపు కేవలం రూ.2 కోట్ల లోపు డిపాజిట్ చేసిన వారికే పరిమితం చేశాయి. ఈ నేపథ్యంలో రూ.2 కోట్ల కంటే ఎక్కువ బల్క్ డిపాజిట్లు చేసే వారికి కొన్నిబ్యాంకులు ప్రత్యేక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సెప్టెంబర్ 8, 2023 నుంచి తన బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లను సవరించింది. అయితే ఈ ఎఫ్‌డీలకు ముందస్తు ఉపసంహరణ సౌకర్యం లేదు. డిపాజిట్లు రూ.2 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ఉంటాయి. డిపాజిటర్లు దాదాపు 7.60 శాతం వడ్డీ సంపాదించవచ్చు. అకాల ఉపసంహరణ అనుమతించబడిన బల్క్ ఎఫ్‌డీలపై సౌకర్యం అనుమతించబడని వాటితో పోలిస్తే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. పదవీకాలం 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. కాబట్టి ఈ తాజాగా పెంపుపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ రూ. 2కోట్ల కంటే ఎక్కువ బల్క్‌గా డిపాజిట్ చేసే వారికి 366 – 399 రోజుల వ్యవధిలో 7.60 శాతం రేటును అందిస్తోంది. అయితే 400 రోజుల నుంచి 731 రోజుల వరకు 7.50 శాతం రేటును ఆఫర్ చేస్తోంది. అలాగే బ్యాంక్ 271 – 365 రోజుల కాలవ్యవధిపై 7.45 శాతం, 181 – 270 రోజులలో 7.40 శాతం రేటును అందిస్తోంది. 92 – 180 రోజులతో పాటు 732 – 1095 రోజుల వ్యవధిలో 7.25% రేటు అందిస్తారు. 3 సంవత్సరాల 1 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీలపై 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే 61-91 రోజుల కాలవ్యవధిపై 6.70 శాతం, 46-60 రోజుల కాలవ్యవధిపై 6.05శాతం, 36-45 రోజుల మెచ్యూరిటీలపై 5.55 శాతం, 15-35 రోజుల కాలవ్యవధిపై 5.30శాతం, 7-14 రోజుల వ్యవధిలో 5.25 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు.
ముందస్తు ఉపసంహరణ నిల్
ముందస్తు ఉపసంహరణ సౌకర్యంతో రూ. 2 కోట్ల నుండి రూ. 25 కోట్ల వరకు బల్క్ ఎఫ్‌దీలపై వడ్డీ రేటు సాధారణం 5.25 శాతం నుంచి 7.45% వరకు ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్‌కి ముందస్తు ఉపసంహరణ సదుపాయం ఉండదని ఐడీఎఫ్‌సీ ప్రకటించింది. అయితే డిపాజిట్ గడువు ముగిసేలోపు డిపాజిటర్ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను మూసివేయలేరు. కానీ ఏదైనా చట్టబద్ధమైన/లేదా నియంత్రణ అధికారం/లేదా ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా, లేకపోతే మరణించిన క్లెయిమ్ సెటిల్‌మెంట్ కేసుల నుంచిఏదైనా ఆదేశాలు వచ్చినప్పుడు, అసాధారణమైన పరిస్థితుల్లో ఈ డిపాజిట్లను ముందస్తుగా ఉపసంహరించుకోవడానికి బ్యాంక్ అనుమతించవచ్చు. ఇలాంటి అసాధారణ పరిస్థితులలో ఈ డిపాజిట్లను అకాల ఉపసంహరణ సందర్భంలో డిపాజిట్ అసలు మొత్తంపై బ్యాంక్ ఎలాంటి వడ్డీని చెల్లించదు. అటువంటి అకాల మూసివేత తేదీ వరకు క్రెడిట్ చేసిన లేదా చెల్లించిన ఏదైనా వడ్డీ డిపాజిట్ మొత్తం నుండి తిరిగి పొందవచ్చు. అలాగే నెలవారీ వడ్డీ చెల్లింపు ఎంపిక అందుబాటులో లేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి