IDFC Bank: తన వద్ద పనిచేస్తున్నవారికి కోట్ల విలువైన షేర్లను బహుకరించిన ఆ సీఈఓ.. ఇంతకీ విషయం ఏంటంటే..

IDFC Bank: ఆయన పేరు వైద్యనాథన్. ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ కు ఎండీ, సీఈఓ గా ఉన్నత స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. తన వద్ద పనిచేస్తున్న వారికి 9 లక్షల బ్యాంక్ షేర్లను బహుమతి ఇచ్చారు. వాటి విలువ అక్షరాలా ఎన్ని కోట్లంటే..

IDFC Bank: తన వద్ద పనిచేస్తున్నవారికి కోట్ల విలువైన షేర్లను బహుకరించిన ఆ సీఈఓ.. ఇంతకీ విషయం ఏంటంటే..
Idfc First Bank
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 22, 2022 | 8:41 AM

IDFC Bank: ఆయన పేరు వైద్యనాథన్. ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ కు ఎండీ, సీఈఓ గా ఉన్నత స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. తన వద్ద పనిచేస్తున్న వారికి 9 లక్షల బ్యాంక్ షేర్లను బహుమతి ఇచ్చారు. వాటి విలువ అక్షరాలా రూ. 3.95 కోట్లు. ఇది వింటే మీకు ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. వీరెవరికీ బ్యాంకుతో ఎటువంటి సంబంధం లేదని తెలుస్తోంది. వైద్యనాథన్ కు ట్రైనర్ గా పనిచేస్తున్న రమేశ్ రాజుకు 3 లక్షల షేర్లు, ఇంటి పనిలో సాయం చేసే నర్వేకర్ కు 2 లక్షల షేర్లు, కార్ డ్రైవర్ అల్గార్ సామి సి. మునాపర్ కు 2 లక్షల షేర్లు, కార్యాలయ సిబ్బంది దీపక్ పథారేకు లక్ష షేర్లు ఇవ్వగా.. ఇంటి పనిలో సాయంగా ఉండే మరో వ్యక్తి సంతోష్ జోగలేకు మరో లక్ష షేర్లను బహుమతిగా ఇచ్చారు.

ఇవీ చదవండి..

EV Charging Stations: ఆ నగరాల్లో పెరిగిన ఎలక్ర్టిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు.. అక్కడే ఎందుకంటే..

Rupee: ఆ కారణంగా పెరుగుతున్న రూపాయి మారకపు విలువ.. కారణమేంటంటే..