EV Charging Stations: ఆ నగరాల్లో పెరిగిన ఎలక్ర్టిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు.. అక్కడే ఎందుకంటే..

EV Chgaring Stations: దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా సహా తొమ్మిది ప్రధాన నగరాల్లో గత నాలుగు నెలల్లో ఎలక్ర్టిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య వేగంగా పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంలో భాగంగా..

EV Charging Stations: ఆ నగరాల్లో పెరిగిన ఎలక్ర్టిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు.. అక్కడే ఎందుకంటే..
Ev Charging Stations
Follow us

|

Updated on: Feb 22, 2022 | 8:02 AM

EV Charging Stations: దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా సహా తొమ్మిది ప్రధాన నగరాల్లో గత నాలుగు నెలల్లో ఎలక్ర్టిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య వేగంగా పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంలో భాగంగా.. పెద్ద నగరాల్లో EV ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 2021 నుంచి జనవరి 2022 మధ్య కాలంలో.. ఈ తొమ్మిది నగరాల్లో కొత్తగా 678 ఛార్జింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. దీని కారణంగా.. ఈ నగరాల్లో ప్రస్తుతం ఉన్న పబ్లిక్ EV స్టేషన్ల సంఖ్య 940కి పెరిగింది.

ఇప్పుడు దేశవ్యాప్తంగా వాటి సంఖ్య దాదాపు 1,640కు చేరింది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా దేశంలో ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వీటికి సంబంధించిన మౌలిక సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం మరింతగా బలోపేతం చేయటంతో పాటు.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేందుకు చర్యలు చేపట్టాలి. ఇందుకోసం వినియోగదారులకు అవసరమైన ప్రోత్సాహకాలను అందించాలి.

ఇవీ చదవండి..

Rupee: ఆ కారణంగా పెరుగుతున్న రూపాయి మారకపు విలువ.. కారణమేంటంటే..

IRCTC: రైలు ప్రయాణికులకు శుభవార్త.. అలా టిక్కెట్లను బుక్ చేసుకోండి.. బహుమతులు పొందండి..