Property will: వీలునామా ఎందుకు రాయాలి? దానికోసం నియమాలు ఏమిటి?
వీలునామా అనేది మీ ఆస్తులను ఎలా బదిలీ చేయాలనుకుంటున్నారో వివరించే చట్టపరమైన పత్రం తప్ప మరొకటి కాదని గుర్తుంచుకోండి. మీ ఆస్తుల పరిమాణంతో దీనికి పట్టింపు లేదు. అంటే ఎంత ఆస్తి ఉంది.. దాని విలువ ఎంత అనేది సమస్యే కాదు. అయితే వీలునామా పై మీరు సంతకం చేసేటప్పుడు మీరు ఇద్దరు సాక్షులను కలిగి ఉండాలి. మీ కోరికలను అమలు చేసే వారు అంటే మీ వీలునామాను అమలు చేయగలిగే..

నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు ఇవ్వను వెళ్లిపో.. అనే మాటలు ఎన్నో వింటుంటాము. తిరగబడ్డ తన పిల్లలతో పెద్ద ధనవంతుడు ఇలాంటి మాటను అనడం మీరు ఎన్నో సినిమాల్లో చూసి ఉంటారు. ఇలా ధనవంతులు మాత్రమే వారి వారసులను ఇలా అంటారని మీరు అనుకుంటున్నారా? కాదు చాలామంది తల్లిదండ్రులు ఇదే మాట తమ మాట వినని పిల్లలతో అంటూ ఉంటారు. అయితే, ఎక్కువగా డబ్బున్న వారే ఈ విషయాన్ని వీలునామాలో రాస్తారు. కానీ, మధ్య తరగతి ప్రజలు మాటలు అనడం తప్ప వీలునామా రాయడం జోలికి పోరు. ఇదిగో అలానే వీలునామా లేని కారణంగా.. వారసులు ఎవరో తెలియక మన దేశంలో ప్రస్తుతం 1,50,000 కోట్ల రూపాయల సొమ్ము క్లెయిమ్ కాకుండా పడి ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం ఇన్సూరెన్స్ లేదా బ్యాంక్ డిపాజిట్లే. ఇంత సొమ్మును ప్రజలు మర్చిపోయారు.
అంతేకాకుండా, 31 జనవరి 2023 నాటికి పెట్టుబడిదారుల విద్య- రక్షణ నిధి (ఐఈపీఎఫ్)లో దాదాపు రూ. 5,675 కోట్లు కదలకుండా అలా పడి ఉన్నాయి. 7 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులుగా క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన అన్ని షేర్లు, డివిడెండ్‌లు, డిబెంచర్లు అలాగే సేకరించిన వడ్డీలు ఐఈపీఎఫ్‌కి బదిలీ అయిపోతాయి. అందుకే మీ జీవితకాల శ్రమ మీ పిల్లలకు లేదా మీరు ఎంచుకున్న వారికి అటువంటి ఫండ్‌లలో మురిగిపోయి ఉండిపోయే బదులు వారికీ చేరేలా చేయడానికి వీలునామా కలిగి ఉండటం ముఖ్యం.
వీలునామా అనేది మీ ఆస్తులను ఎలా బదిలీ చేయాలనుకుంటున్నారో వివరించే చట్టపరమైన పత్రం తప్ప మరొకటి కాదని గుర్తుంచుకోండి. మీ ఆస్తుల పరిమాణంతో దీనికి పట్టింపు లేదు. అంటే ఎంత ఆస్తి ఉంది.. దాని విలువ ఎంత అనేది సమస్యే కాదు. అయితే వీలునామా పై మీరు సంతకం చేసేటప్పుడు మీరు ఇద్దరు సాక్షులను కలిగి ఉండాలి. మీ కోరికలను అమలు చేసే వారు అంటే మీ వీలునామాను అమలు చేయగలిగే వారు దగ్గర ఉండాలి. మీరు వేరు వేరు చోట్ల.. అంటే వేరు వేరు రాష్టాలలో ఆస్తులను కలిగి ఉన్నా ఒకటే వీలునామా సరిపోతుంది. అలాగే ఒక్కచోట రిజిస్టర్ చేస్తే చాలు. వేరు వేరు చోట్ల.. రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు.
బ్యాంకు అకౌంట్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్‌లు, ఇన్సూరెన్స్ పాలసీలు, రియల్ ఎస్టేట్ లేదా ఏదైనా ఇతర ఆస్తులు/పెట్టుబడులు వంటి నిర్దిష్ట పెట్టుబడులను కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ వీలునామాను కలిగి ఉండాలి అని జీఎల్‌సీ వెల్త్ ఎడ్వయిజర్ ఎల్‌ఎల్‌పీ సహ-వ్యవస్థాపకుడు, సీఈవో సంచిత్ గార్గ్ చెబుతున్నారు. అంతేకాకుండా దీన్ని రిజిస్టర్ చేయడం వలన మీ మరణం తర్వాత ఏవైనా సవాళ్లు తలెత్తే అవకాశాలను తగ్గిస్తుంది అన్నారు.
ఆసాన్‌విల్ వ్యవస్థాపకుడు, సీఈవో విష్ణు చుండి మాట్లాడుతూ.. తమ ఆస్తులను కాపాడుకోవాలని చూస్తున్న అన్ని ఆర్థిక నేపథ్యాల వ్యక్తులకు వీలునామా అవసరంగా ఉంటుంది. ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఇది ఒకరి వస్తువులు నిజమైన యజమానులకు చేరేలా చేస్తుంది. తద్వారా కుటుంబ వివాదాలు, చట్టపరమైన సంక్లిష్టతలను నివారించవచ్చు.
18 ఏళ్లు పైబడిన ఎవరైనా వీలునామాను రూపొందించడానికి అర్హులు. అయితే, వివాహం, ప్రసవం మొదలైన జీవిత మైలురాళ్లను బట్టి, మీరు మీ ఇష్టాన్ని నిరంతరం అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, మీరు మీ కుమారుడి పేరుపై వీలునామా రాసి ఉంచారు. అయితే తరువాత మీకు మీ భార్య పేరు మీద కూడా కొంత ఆస్తి ఉండాలని అనిపించవచ్చు. అప్పుడు మీరు మీ వీలునామాలో ఆమె పేరు కూడా చేర్చి మార్పించుకోవడం అవసరం.
సాధారణంగా లాయర్లు వీలునామా చేయడానికి రూ. 20,000-50,000 మధ్య వసూలు చేస్తారు. కానీ మీరు ఆసన్‌విల్, ఎల్లో, విల్‌స్టార్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రూ. 899 కంటే తక్కువ ధరతో మీ విల్ మేకింగ్ ప్రక్రియను ప్రారంభించవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో ఉమ్మడి ఆస్తులను కలిగి ఉన్నట్లయితే మీరు దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. .
గార్గ్ వీలునామాను సిద్ధం చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన పాయింటర్‌ల సెట్‌ను లిస్ట్ చేశారు. ఇందులో మీ పేరు, చిరునామా, మీ ఇష్టాన్ని అమలు చేయడానికి నియమించిన వ్యక్తి పేరు ఉంటాయి. డెత్ విల్ చేసే వ్యక్తి మంచి మనస్సు కలిగి ఉన్నాడని, స్వచ్ఛందంగా ఎటువంటి బలవంతం లేకుండా వీలునామా చేస్తున్నాడని దానితో పాటు వీలునామా చేయవలసిన అవసరాన్ని వివరించాలని ఆయన చెప్పారు. మీ ఆస్తులను కట్టబెట్టడంలో నిస్సందేహమైన భాషను ఉపయోగించడం తప్పనిసరి. వీలునామాపై వ్యక్తి సంతకం చేయాలి. ఇద్దరు సాక్షులు ఒకరి సమక్షంలో ఒకరు దీనిని ధృవీకరించాలి. కుటుంబ సభ్యుడి చట్టపరమైన వారసుడు, స్నేహితుడు లేదా సీఏ, న్యాయవాదులు వంటి నిపుణులు వంటి ప్రధాన వ్యక్తి ఎవరైనా దీనికోసం కార్యనిర్వాహకుడిగా పనిచేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి