- Telugu News Photo Gallery Business photos How to invest in Sovereign Gold Bonds latest series launch
Gold Invest: సావరిన్ గోల్డ్ బాండ్స్ తాజా సిరీస్ ప్రారంభం.. ఇన్వెస్ట్ చేయడం ఇలా..
బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకునే వారి కోసం ప్రభుత్వం అందించే గోల్డ్ బాండ్ స్కీం మళ్ళీ అందుబాటులోకి వచ్చింది. గోల్డ్ బాండ్ స్కీమ్ (SGBs) 2023-24 రెండవ సిరీస్ సోమవారం అంటే సెప్టెంబర్ 11 నుంచి ఓపెన్ అవుతోంది. సెప్టెంబర్ 15 వరకు ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈసారి 1 గ్రాము బంగారం ధర రూ.5,923గా నిర్ణయించారు. ఆన్‌లైన్ ఆఫ్‌లైన్ రెండు విధానాల్లోనూ ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే మీకు రూ. 50 తగ్గింపు లభిస్తుంది. అంటే గ్రాముకు రూ. 5,873 ఖర్చు అవుతుంది. సావరిన్ గోల్డ్ బాండ్ అనేది ప్రభుత్వ బాండ్. దీన్ని డీమ్యాట్‌గా మార్చుకోవచ్చు.
Updated on: Sep 12, 2023 | 6:22 PM

బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకునే వారి కోసం ప్రభుత్వం అందించే గోల్డ్ బాండ్ స్కీం మళ్ళీ అందుబాటులోకి వచ్చింది. గోల్డ్ బాండ్ స్కీమ్ (SGBs) 2023-24 రెండవ సిరీస్ సోమవారం అంటే సెప్టెంబర్ 11 నుంచి ఓపెన్ అవుతోంది. సెప్టెంబర్ 15 వరకు ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈసారి 1 గ్రాము బంగారం ధర రూ.5,923గా నిర్ణయించారు.

ఆన్‌లైన్ ఆఫ్‌లైన్ రెండు విధానాల్లోనూ ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే మీకు రూ. 50 తగ్గింపు లభిస్తుంది. అంటే గ్రాముకు రూ. 5,873 ఖర్చు అవుతుంది.

సావరిన్ గోల్డ్ బాండ్ అనేది ప్రభుత్వ బాండ్. దీన్ని డీమ్యాట్‌గా మార్చుకోవచ్చు. ఐదు గ్రాముల బంగారం బాండ్ అయితే, బాండ్ ధర ఐదు గ్రాముల బంగారం ధరతో సమానంగా ఉంటుంది. సావరిన్ గోల్డ్ బాండ్‌లో, మీరు 24 క్యారెట్ల అంటే 99.9% స్వచ్ఛమైన బంగారంలో పెట్టుబడి పెట్టె అవకాశం ఉంటుంది. SGBలలో పెట్టుబడుల పై 2.50% వార్షిక వడ్డీ వస్తుంది.


అయితే ఏదైనా ట్రస్ట్ ఈ బాండ్స్ కొనాలంటే దానికి గరిష్ట పరిమితి 20 కిలోల వరకూ ఉంటుంది.మీరు మీ డబ్బును 5 సంవత్సరాల తర్వాత ఉపసంహరించుకుంటే, దాని నుండి వచ్చే లాభం పై దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG) రూపంలో 20.80% పన్ను విధిస్తారు.

దీనిలో పెట్టుబడి పెట్టడానికి RBI అనేక ఎంపికలను ఇచ్చింది. బ్యాంకు బ్రాంచీలు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SHCIL) ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు.




