Electric Motorcycle: క్రూయిజర్ లుక్‌లో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ చార్జ్‌పై 180 కి.మీ. రివర్స్ గేర్ ఆప్షన్‌తో సెన్సేషన్..
దేశీయ కంపెనీ అయిన ఏబీజెడ్ఓ(ABZO) మోటార్స్ ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తమ మొదటి మోటార్ సైకిల్ ఏబీజెడ్ఓ వీఎస్01 పేరిట మన దేశంలో లాంచ్ చేసింది. ప్రారంభ ధర రూ. 1.8 లక్షల నుంచి టాప్ వేరియంట్ రూ. 2.2 లక్షల(ఎక్స్ షోరూం)తో బైక్ ను ఆవిష్కరించింది. ఈ మోటార్ సైకిల్ సింగిల్ చార్జ్ పై 180 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని ఆ కంపెనీ ప్రకటించింది.
మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి గిరాకీ ఉంటోంది. నెమ్మదిగా సంప్రదాయ ఇంధన వాహనాల స్థానాన్ని విద్యుత్ వాహనాలు ఆక్రమించేస్తున్నాయి. ముఖ్యంగా టూవీలర్లు అందులోనూ ఎలక్ట్రిక్ స్కూటర్లు దేశీయ మార్కెట్లో తమదైన ముద్ర వేస్తున్నాయి. దీంతో పెద్ద కంపెనీలతో పాటు కొత్త కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ బైక్ లు కాస్త నెమ్మదిగా మార్కెట్లోకి అడుగు పెడుతున్నాయి. కొన్ని స్టార్టప్ కంపెనీలతో పాటు, టాప్ బ్రాండ్లు కూడా ఉత్తమ ఫీచర్లతో కూడిన బైక్ లను ఆవిష్కరిస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ కంపెనీ అయిన ఏబీజెడ్ఓ(ABZO) మోటార్స్ ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తమ మొదటి మోటార్ సైకిల్ ఏబీజెడ్ఓ వీఎస్01 పేరిట మన దేశంలో లాంచ్ చేసింది. ప్రారంభ ధర రూ. 1.8 లక్షల నుంచి టాప్ వేరియంట్ రూ. 2.2 లక్షల(ఎక్స్ షోరూం)తో బైక్ ను ఆవిష్కరించింది. ఈ మోటార్ సైకిల్ సింగిల్ చార్జ్ పై 180 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని ఆ కంపెనీ ప్రకటించింది. అతి తక్కువ మెయింటెనెన్స్ తో ఎకో ఫ్రెండ్లీ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా ఆ తరహా మోటార్ సైకిల్ ను మార్కెట్లోకి లాంచ్ చేసినట్లు ఏబీజెడ్ఓ(ABZO) ప్రకటించుకుంది. ఈ ఏబీజెడ్ఓ(ABZO) వీఎస్01 ఎలక్ట్రిక్ బైక్ కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, రేంజ్ వంటి వివరాలు తెలుసుకుందాం..
నాలుగు రకాల షేడ్లలో..
ఏబీజెడ్ఓ(ABZO) వీఎస్01 ఎలక్ట్రిక్ బైక్ క్రూయిజర్ లుక్ లో కనిపిస్తోంది. ఇది నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అవేంటంతే ఇంపెరియల్ రెడ్, మౌంటేన్ వైట్, జార్జియన్ బే, బ్లాక్ వంటి రంగుల్లో ఈ బైక్ చూడముచ్చటగా ఉంది. ముందు వైపు, వెనుక వైపు ఎల్ఈడీ హెడ్ లైట్లు, టైల్ లైట్లు వస్తాయి. దీనిలో ఫుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. 17 అంగుళాల ట్యూబ్ లెస్ టైర్లతో కూడిన అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఈ మోటార్ సైకిల్ 1473ఎంఎం పొడవు ఉంటుంది. 158ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 700ఎంఎం సీట్ ఎత్తు ఉంటుంది. దీనిలో మూడు రకాల రైడింగ్ మోడ్లు ఎకో, నార్మల్, స్పోర్ట్స్ మోడ్లలో అందుబాటులో ఉంటాయి.
సేఫ్టీకి అధిక ప్రాధాన్యం..
ఏబీజెడ్ఓ(ABZO) వీఎస్01 ఎలక్ట్రిక్ బైక్ లో 72వోల్ట్స్, 72ఏహెచ్ సామర్థ్యంతో కూడిన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అలాగే 8.44హెచ్ పీ పవర్, 190ఎన్ఎం పీక్ టార్క్ ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది రిజనరేటివ్ బ్రేకింగ్ ను సపోర్టు చేస్తుంది. డిస్క్ బ్రేకులు ఉంటాయి. ముందూ వెనుకా కూడా ఒకే తరహా బ్రేకింగ్ వ్యవస్థ ఉంటుంది. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్(సీబీఎస్)ఆధారంగా పనిచేస్తుంది. ముందువైపు టెలీ స్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, డ్యూయల్ షాక్ అడ్జర్బర్స్ ఉంటాయి. దీనిలో రివర్స్ మోడ్ కూడా ఉంటుంది. దీంతో రైడర్లకు ట్రాఫిక్ సమయంలో, పార్కింగ్ స్థలాల్లో చాలా ప్రయోజకరంగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..