AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC RuPay Credit Card: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్‌ని యూపీఐతో లింక్‌ చేయడం ఎలా..?

దేశంలో ఆన్‌లైన్ చెల్లింపులను ప్రోత్సహించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఇటీవల యూపీఐని క్రెడిట్ కార్డ్‌లతో లింక్ చేసే సదుపాయాన్ని..

HDFC RuPay Credit Card: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్‌ని యూపీఐతో లింక్‌ చేయడం ఎలా..?
Hdfc Rupay Credit Card
Subhash Goud
|

Updated on: Feb 17, 2023 | 9:00 AM

Share

దేశంలో ఆన్‌లైన్ చెల్లింపులను ప్రోత్సహించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఇటీవల యూపీఐని క్రెడిట్ కార్డ్‌లతో లింక్ చేసే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి చాలా బ్యాంకులు తమ రూపే క్రెడిట్ కార్డ్‌ను యూపీఐతో లింక్ చేసే సదుపాయాన్ని ప్రారంభించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పేరు కూడా చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్‌పీసీఐ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇప్పుడు బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్‌ని సులభంగా యూపీఐ ఐడీకి లింక్ చేయవచ్చు.

హెచ్‌డిఎఫ్‌సి రూపే క్రెడిట్ కార్డ్‌ని యుపిఐతో లింక్ చేసే సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తర్వాత కోట్లాది మంది బ్యాంక్ కస్టమర్‌లు దాని ప్రయోజనం పొందుతారు. దీనితో వినియోగదారులు యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డును ఉపయోగించుకునే అవకాశాన్ని పొందుతారు. దీనితో పాటు డిజిటల్ యూపీఐ చెల్లింపు కూడా దేశంలో ఊపందుకుంటుంది.

హెచ్‌డీఎఫ్‌సీ రూపే క్రెడిట్ కార్డ్‌ని యూపీఐతో లింక్ చేయడం ఎలా?

  • హెచ్‌డీఎఫ్‌సీ రూపే క్రెడిట్ కార్డ్‌ని యూపీఐతో లింక్ చేసే ప్రక్రియ చాలా సులభం.
  • ఇందుకోసం ముందుగా BHIM యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి.
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, మీరు క్రెడిట్ కార్డ్ ఎంపికను ఎంచుకోండి.
  • దీని తర్వాత ఆప్షన్ నుంచి మీ క్రెడిట్ కార్డ్ బ్యాంక్ పేరును ఎంచుకోండి.
  • తర్వాత ఇక్కడ మీ అప్‌డేట్ చేయబడిన రిజిస్టర్డ్‌ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
  • దీని తర్వాత కార్డ్‌ని ఎంచుకుని కన్ఫర్మ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • దీని తర్వాత మీ UPI పిన్‌ని రూపొందించండి.

రూపే క్రెడిట్ కార్డ్‌తో UPI చెల్లింపు ఎలా చేయాలి

  • చెల్లింపు చేయడానికి ముందుగా UPI QR కోడ్‌ని స్కాన్ చేయండి.
  • ఆ తర్వాత మీరు చెల్లించాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి.
  • దీని తర్వాత క్రెడిట్ కార్డ్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • దీని తర్వాత UPI పిన్‌ని నమోదు చేయండి.
  • దీని తర్వాత మీ చెల్లింపు చేయండి..

ఈ బ్యాంకుల రూపే క్రెడిట్ కార్డ్‌తో UPI చెల్లింపు చేయవచ్చు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో పాటు, మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపే క్రెడిట్ కార్డ్, ఇండియన్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్‌తో యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. ఈ మూడు బ్యాంకుల క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేసే ప్రక్రియ హెచ్‌డిఎఫ్‌సి మాదిరిగానే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం

ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు