Gold Price Today: పసిడి కొనుగోలుదారులకు షాకింగ్‌ న్యూస్‌.. పెరిగిన బంగారం ధర.. తాజా ధరలు ఇలా ఉన్నాయి..!

Gold Price Today: బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. తాజాగా బంగారం ప్రియులకు ధరలు షాకిచ్చాయి. ఒక రోజు ధరలు తగ్గితే.. మరొక రోజు..

Gold Price Today: పసిడి కొనుగోలుదారులకు షాకింగ్‌ న్యూస్‌.. పెరిగిన బంగారం ధర.. తాజా ధరలు ఇలా ఉన్నాయి..!
Gold Price Today
Follow us
Subhash Goud

|

Updated on: Jun 24, 2021 | 6:45 AM

Gold Price Today: బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. తాజాగా బంగారం ప్రియులకు ధరలు షాకిచ్చాయి. ఒక రోజు ధరలు తగ్గితే.. మరొక రోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టి పెడుతుంటారు. అయితే తాజాగా గురువారం దేశీయంగా 10 గ్రాముల బంగారంపై రూ.300 వరకు పెరుగగా, కొన్ని ప్రాంతాల్లో నిలకడగా ఉంది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,340 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,110 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 వద్ద కొనసాగుతోంది.

అయితే గురువారం ఉదయం ఉన్న ధరలు ఇవి. ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయంలో ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం బెటర్‌.

ఇవీ కూడా చదవండి

Fixed Deposits: రెండు, మూడు సంవత్సరాల స్థిర డిపాజిట్లపై అధిక వడ్డీ అందిస్తున్న టాప్‌ 10 బ్యాంకులు

Jet Airways: ఈ ఏడాది చివరిలో మళ్లీ కార్యకలాపాలు సాగించనున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు..!