Jet Airways: ఈ ఏడాది చివరిలో మళ్లీ కార్యకలాపాలు సాగించనున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు..!

Subhash Goud

Subhash Goud |

Updated on: Jun 23, 2021 | 10:25 AM

Jet Airways: జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు ఈ ఏడాది చివరిలో మళ్లీ కార్యకలాపాలు సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంలో దివాలా తీసిన ప్రైవేటు రంగ విమానయాన..

Jet Airways: ఈ ఏడాది చివరిలో మళ్లీ కార్యకలాపాలు సాగించనున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు..!
Jet Airways

Jet Airways: జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు ఈ ఏడాది చివరిలో మళ్లీ కార్యకలాపాలు సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంలో దివాలా తీసిన ప్రైవేటు రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఆకాశంలో ఎగిరేందుకు మార్గం దాదాపు సుగమమైంది. ఈ కంపెనీని బయటపడేందుకు జలాన్‌ కల్రాక్‌ కనార్షియం ప్రతిపాదించిన పరిష్కార ప్రణాళికకు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) మంగళవారం ఆమోద ముద్ర వేసింది. 2019 ఏప్రిల్‌ 17న కార్యకలాపాలను నిలిపివేసిన జెట్‌ ఎయిర్‌వేస్‌ నుంచి రూ.8 వేల కోట్లకుపైగా బకాయిలను రాబట్టుకోవడం కోసం అదే ఏడాది జూన్‌లో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో రుణదాతలు దివాలా పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణ పరిష్కార ప్రణాళికకు మొహమ్మద్‌ అజ్మల్‌, నల్లసేనాపతి ఆధ్వర్యంలో ఎన్‌ఎసీఎల్‌టీ ముంబాయి ధర్మాసనం ఆమోదం తెలిపింది. జూన్‌ 22 నుంచి 90 రోజుల్లోగా ఈ ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించింది. ఒక వేల గడువు పొడిగించుకోవాలనుకుంటే తిరిగి ధర్మాసనాన్ని కోరవచ్చని జలాన్‌ కల్రాక్‌ కన్సార్షియంకు ఆదేశాలు ఇచ్చింది. అయితే జెట్‌ ఎయిర్‌వేస్‌కు గతంలో ఉన్న స్లాట్ల ఆధారంగా మళ్లీ కేటాయించాలనే ఆదేశాలు జారీ చేయడం లేదని ట్రైబ్యునల్‌ పేర్కొంది. ఆ విషయంలో ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. కార్యకలాపాలు నిలవడానికి ముందు వివిధ విమానాశ్రయాల్లో ఈ సంస్థకున్న స్లాట్లను ఇతర విమానయాన సంస్థలకు కేటాయించారు.

రూ.240 షేరు కాస్తా.. రూ.99కి

అయితే జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు విలువ గత రెండు సంతవ్సరాలలో సగానికి పైగా దివాలా తీసింది. సంస్థ కార్యకలాపాలు నిలుపడానికి ఒక రోజు ముందు అంటే ఏప్రిల్‌ 16, 2019 బీఎస్‌ఈలో రూ.241.85 వద్ద షేరు స్థిరపడింది. మంగళవారం 5 శాతం లాభపడినా కూడా, ఇప్పటివరకు 58.87 శాతం నష్టపోయి రూ.99.45కు చేరింది. మార్కెట్‌ విలువ రూ.1617.27 కోట్లు తగ్గి, రూ.1129.73 కోట్లకు పరిమితమైంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

రెండు సంవత్సరాల కిందట కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయిన తర్వాత జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఉన్న స్లా్ట్లు ఇతర ఆపరేటర్లకు చేరాయి. కంపెనీ సర్వీసులు పునః ప్రారంభం కావడానికి ఇవి కీలకంగా ఉండనున్నాయి. పరిష్కార వృత్తి నిపుణుడైన ఆశీష్‌ ఇదే విషయాన్ని ఎన్‌సీఎల్‌టీ దృష్టికి తీసుకెళ్లారు. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ), పౌర విమానయాన శాఖ (ఎంవోసీఏ) దీనిపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరారు. గత చరిత్ర ఆధారంగా జెట్‌ ఎయిర్‌వేస్‌కు స్లాట్లను కేటాయించడం కుదరదని, నిర్దిష్ట మార్గదర్శకాలకు లోబడే కేటాయింపు ఉంటుందని ఎన్‌సీఎల్‌టీకి దాఖలు చేసిన సంయుక్త అఫిడవిట్‌లో డీజీసీఏ, ఎంవోసీఏ స్పష్టం చేశాయి. పలు విమానాశ్రయాలు సామర్థ్యాన్ని విస్తరించుకుంటున్న నేపథ్యంలో తగు స్థాయిలో స్లాట్లు అందుబాటులో ఉండవచ్చని ఆయన తెలిపారు.

ఇవీ కూడా చదవండి:

Hyderabad MMTS Trains: హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. ఈ రోజు నుంచి పరుగులు పెట్టనున్న ఎంఎంటీఎస్ రైళ్లు

Fixed Deposits: రెండు, మూడు సంవత్సరాల స్థిర డిపాజిట్లపై అధిక వడ్డీ అందిస్తున్న టాప్‌ 10 బ్యాంకులు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu