Gold Price Today: హమ్మయ్యా.! భారీగా దిగొచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దీపావళి ముందుగా బంగారం, వెండి ధరల్లో కాస్త హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో.. దేశీయ మార్కెట్లలోనూ దీని ప్రభావం పడిందని బిజినెస్ నిపుణులు అంటున్నారు. మరి అదేంటో ఇప్పుడు చూసేద్దాం..
అంతర్జాతీయంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుండటంతో.. దేశీయంగా కూడా ఆ ప్రభావం పడుతోంది. గత నాలుగు రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన రెండు రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ఏకంగా రూ. 500 మేరకు తగ్గింది. గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ ధరలు కాస్త శాంతించడం, అమెరికాలో ఎన్నికలు సమీపిస్తుండటం.. లాంటి అంశాలు దేశీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు తగ్గడానికి కారణం కావచ్చునని బిజినెస్ నిపుణులు అంటున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో అక్టోబర్ 29న అనగా మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 460 మేరకు తగ్గి.. రూ. 73,140 దగ్గర కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 500 మేరకు తగ్గి.. రూ. 79,790 దగ్గర స్థిరంగా కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండివిజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,140 దగ్గర ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,790గా ఉంది.
దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో ఇలా..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,290 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 79,940.
ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై నగరాల్లో.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 73,140 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,790.
ఇది చదవండి: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే
వెండి ధర ఇలా..
దేశవ్యాప్తంగా వెండి ధరల్లో కాస్త హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత వారం చివరి నుంచి సుమారు రూ. 6 వేలు తగ్గిన వెండి ధర.. గడిచిన మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. ఇక మంగళవారం స్వల్పంగా తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,06,900. అలాగే కోల్‌కతా, ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.97,900. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 96,900కు చేరింది.
ఈ ధరలు ఈరోజు ఉదయం ఆరు గంటలకు నమోదైనవిగా గమనించగలరు. బంగారం కోనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు చెక్ చేసుకోవడం బెటర్. ఇక లేటెస్ట్ బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..