Gold and Silver Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు..

అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ మారకంపై పసిడి ధరలు ఆధారపడి ఉంటాయని ఆర్ధిక రంగ నిపుణులు చెబుతున్నారు. యూఎస్ డాలర్ డిమాండ్ తగ్గిన సమయంలో బంగారానికి భారీ డిమాండ్ ఉంటుంది. దీంతో బంగారం ధరలు రోజు రోజుకీ పై పైకి వెళ్తున్నాయని చెబుతున్నారు. అయితే ఈ రోజు మాత్రం పసిడి ప్రియులకు ఊరట నిస్తూ కొంతమేర బంగారం ధర తగ్గింది. ఈ నేపధ్యంలో తెలుగురాష్ట్రల్లోని ప్రధాన నగరాల్లో సహా దేశీయంగా వివిధ ప్రాంతాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Gold and Silver Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు..
Gold Price
Follow us
Surya Kala

|

Updated on: Jul 19, 2024 | 8:28 AM

భారతీయులకు బంగారానికి అవినావభావ సంబంధం ఉంది. ఇంకా చెప్పాలంటే భారతీయు మహిళలు పసిడి ప్రియులు. పండగలు, శుభకార్యాలు ఇలా ఏ సందర్భంలోనైనా సరే బంగారం నగలు ధరించడానికి ఇష్టపడతారు. తమ ఆర్ధిక శక్తిమేరకు పసిడి కొనుగోలు ఆసక్తిని చూపిస్తారు. బంగారం ఒక స్టేటస్ సింబల్ మాత్రమే కాదు.. ఆర్ధిక భరోసా ఇచ్చే ఒక వనరు కూడా. అయితే గత కొంత కాలంగా బంగారం ధరలు ఆల్ టైం హైకి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ మారకంపై పసిడి ధరలు ఆధారపడి ఉంటాయని ఆర్ధిక రంగ నిపుణులు చెబుతున్నారు. యూఎస్ డాలర్ డిమాండ్ తగ్గిన సమయంలో బంగారానికి భారీ డిమాండ్ ఉంటుంది. దీంతో బంగారం ధరలు రోజు రోజుకీ పై పైకి వెళ్తున్నాయని చెబుతున్నారు. అయితే ఈ రోజు మాత్రం పసిడి ప్రియులకు ఊరట నిస్తూ కొంతమేర బంగారం ధర తగ్గింది. ఈ నేపధ్యంలో తెలుగురాష్ట్రల్లోని ప్రధాన నగరాల్లో సహా దేశీయంగా వివిధ ప్రాంతాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

హైదరాబాద్, విజయవాడ, విశాఖ ఎలా ఉన్నాయంటే..

జూలై 18న భారీగా పెరిగిన బంగార ధర నేడు దేశీయంగా స్వల్పంగా దిగి వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ రోజు అంటే జూలై 19 వ తేదీ హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్స్ పసిడి ధర 10 గ్రాముల రూ. 10 తగ్గి.. నేడు రూ. 68, 590లకు చేరుకుంది. అదే సముయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 మేర తగ్గి రూ. 74, 830లుగా కొనసాగుతోంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, వరంగల్ లలో కూడా కొనసాగుతున్నాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే

దేశ రాజధాని ఢిల్లీ సహా మిగిలిన ప్రధాన నగరాల్లో కూడా స్వల్పంగా బంగారం ధరలు దిగి వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో 22 క్యారెట్స్ 10 గ్రాముల పసిడి ధర రూ. 6,8740 లు ఉంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.7,4980

చెన్నై 22 క్యారెట్స్ 10 గ్రాముల పసిడి ధర రూ. 6,9040లు ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 7,5320

ముంబై 22 క్యారెట్స్ 10 గ్రాముల పసిడి ధర రూ. 6,8590లు ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 7,4830

కోల్‌కతా 22 క్యారెట్స్ 10 గ్రాముల పసిడి ధర రూ. 6,8590లు ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 7,4830

బంగారం బాటలో వెండి ధరలు

బంగారం తర్వాత అత్యధికంగా కొనుగోలు చేసే లోహం వెండి. గత కొంతకాలంగా బంగారం బాటలో పయనిస్తూ వెండి ధరలు కూడా పైపైకి వెళ్తున్నాయి. అయితే ఈ రోజు పసిడి బాటలోనే వెండి ధర కూడా దిగి వచ్చింది. హైదరాబాద్ నగరంలో కేజీ వెండి ధర రూ. 100 తగ్గి.. కేజీకి ప్రస్తుతం రూ. 99,100 కు చేరింది.

ఈ బంగారం ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు సహా ఇతర అంతర్జాతీయ కారకాల ప్రభావంపపై ఆధారపడి ఉంటాయి. ఈరోజు అందిస్తున్న బంగారం, వెండి ధరలు ప్రస్తుత మార్కెట్ ఆధారంగా ఇచ్చింది. పరిస్థితుల ఆధారంగా బహిరంగ మార్కెట్ లో ధరల్లో మార్పులు ఉండవచ్చు. ఈ విషయాన్నీ పాటకులు గమనించగలరు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!