AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanwar Yatra 2024: కన్వర్ యాత్ర మార్గంలో పోలీస్ రూల్స్.. విరుచుకుపడుతున్న విపక్షాలు

ఉత్తరాదిన హిందూ నెలలు పౌర్ణమి తర్వాత రోజు పాడ్యమి తిది నుంచి పున్నమి తిధి వరకూ .. ఈ నేపధ్యంలో ఉత్తరాదిన శ్రావణ మాసం ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. అక్కడ శివ భక్తులకు శ్రావణ మాసం వస్తే చాలు పెద్ద పండగగా భావిస్తారు. శివయ్యను ఈ నెలంతా అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. అంతేకాదు కన్వర్ యాత్రను చేపడతారు. ఈ ఏడాది కన్వర్ యాత్ర సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ పోలీసులు జారీచేసిన ఆదేశాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ముస్లింలను లక్ష్యంగా చేసుకునే పోలీసులు ఈ ఉత్తర్వులు జారీ చేసారని ప్రతి పక్ష నేతలు విమర్శలు చేశారు. 

Kanwar Yatra 2024: కన్వర్ యాత్ర మార్గంలో పోలీస్ రూల్స్.. విరుచుకుపడుతున్న విపక్షాలు
Kanwar Yatra 2024
Surya Kala
|

Updated on: Jul 19, 2024 | 7:13 AM

Share

ఉత్తరాదిలో శివభక్తులు శ్రావసమాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కన్వర్ యాత్ర చేపడతారు. దీనినే కావడి యాత్ర అని కూడా అంటారు. జూలై 22న కన్వర్ యాత్ర ప్రారంభమై ఆగస్టు 2వ తేదీతో ముగుస్తుంది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఉత్తరాఖండ్‌లోని రిషికేష్, హరిద్వార్‌కు కాలినడకన చేరుకుని గంగా జలాలను సేకరించి తిరిగి తమ స్థానిక శివాలయాల్లో సమర్పిస్తారు. అయితే ఈ కావిడి యాత్రకు పెట్టిన రూల్స్ ఇప్పుడు దుమారాన్ని రాజేశాయి.

కన్వర్‌ యాత్ర సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ పోలీసులు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులపై అనేక విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. కన్వర్‌ యాత్ర జరిగే మార్గంలో అన్ని హోటళ్ల యాజమానులు తమ పేర్లను ప్రముఖంగా కనబడే విధంగా ప్రచురించాలని ముజఫర్‌నగర్‌ పోలీసులు ఉత్తర్వులు చేయడం వివాదస్పదంగా మారింది. పోలీసులు జారీచేసిన ఆదేశాలపై ప్రతిపక్షాలు సహా సామాన్యులు సైతం దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది మత వివక్ష తప్ప మరేం కాదని, చూస్తుంటే హిటర్ల్‌ తాలూకు జర్మనీలా ఉందని మండిపడుతున్నారు. ముస్లిం యజమానుల దుకాణాల్లో యాత్రికులు ఏం కొనకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. దక్షిణాఫ్రికాలోని వర్ణవివక్ష, హిట్లర్‌ జర్మనీలోని ‘జుడెన్‌ బాయ్‌కాట్‌’ తప్ప మరోటి కాదని మండిపడ్డారు.

మరోవైపు ఈ ఉత్తర్వులపై సీపీఐ(ఎం) తీవ్రంగా స్పందించింది. ఫాసిస్టులతో పోరాడలని చరిత్ర నేర్పిందని అయితే ఫాసిస్టులను బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ అనుసరిస్తున్నాయని విమర్శించింది. ఉత్తరాఖండ్‌లోనూ ముస్లిం దుకాణ యజమానులను లక్ష్యంగా చేసుకునే యత్నం జరుగుతోందని సీపీఐ(ఎం) ఆరోపించింది. ప్రముఖ బాలీవుడ్ పాటల రచయిత జావేద్ అక్తర్ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. నాజీ జర్మనీలో కొన్ని దుకాణాలు, ఇళ్లకు ప్రత్యేకమైన గుర్తు పెట్టేవారు’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

అయితే పోలీసులు మాత్రం తమ ఆదేశాలను సమర్థించుకుంటున్నారు. భక్తులకు సాయం చేయాలన్న ఉద్దేశమే తప్ప ఇందులో మతపరమైన ఎలాంటి వివక్ష లేదని చెప్తున్నారు. కన్వర్‌ యాత్ర మార్గంలో దుకాణదారులు అన్ని రకాల ఆహారపదార్థాలు విక్రయిస్తారని, కాబట్టి యాత్రికుల్లో గందరగోళం తలెత్తి తద్వారా శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ఉండేందుకే ఈ ఆదేశాలు జారీచేసినట్టు పోలీసులు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..