హైదరాబాద్‌లో రోజుకి నలుగుర్ని… దేశ వ్యాప్తంగా ఏటా 20 లక్షల మందిని చంపేస్తున్న వాయుకాలుష్యం
లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ ఇటీవల ‘‘భారతదేశంలోని పది నగరాల్లో పరిసర వాయు కాలుష్యం, రోజువారీ మరణాలు’’ అనే అంశంపై సంచలన కథనాన్ని ప్రచురించింది. భారత్‌లోని పది నగరాలు.. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పుణె, సిమ్లా, వారణాసిలో అధ్యయనం నిర్వహించింది. ఏటా ఈ నగరాల్లో..

పర్యావరణ పరిరక్షణతోనే జీవకోటి మనుగడ సాధ్యం.. పర్యావరణం పచ్చగా ఉంటేనే సకల జీవరాశులు సుఖ సంతోషాలతో జీవించగలవు.. ‘‘పర్యావరణ పరిరక్షణ.. పర్యావరణానికి పాటుపడాలి.. పర్యావరణ హితం కోసం మనం నడుంబిగించాలి.. ముందు తరాలకు అవసరమైన వనరుల కోసం పర్యావరణాన్ని కాపాడాలి’’.. ఇలాంటి నినాదాలను మనం చిన్ననాటి నుంచి వింటున్నవే.. చదువుకుంటున్నవే.. వాస్తవానికి విశ్వ మానవాళికి, సకల జీవరాశులకు నిలయమైన పుడమితల్లిని.. ప్రకృతిని.. పర్యావరణాన్ని మనం ఎల్లప్పుడూ కలుషితం కాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది.. అంటే మానవులతోపాటు జీవకోటి మనుగడ సాధ్యమవుతుంది.. పర్యావరణం అనేది మన చుట్టూ ఉన్న ప్రతిదీ.. అంటే నేల, నీరు, జంతువులు, మొక్కలు వంటి సజీవ, నిర్జీవ వస్తువులను పర్యావరణం అంటారు.. అవి మన పరిసరాలకు అనుగుణంగా ఉంటాయి. ఇది భూమిపై జీవం పోషణలో సహాయపడే ప్రకృతి వరంగా అభివర్ణిస్తాం.. కానీ.. ఆధునిక ప్రపంచం మాత్రం దీనికి విరుద్దంగా పరుగులు తీస్తోంది.. పర్యావరణానికి హాని తలపెట్టి మరి.. ప్రాణాలను పోగొట్టుకునే వరకు చేరుకుంది. అంటే.. పర్యావరణ కాలుష్యం ఏమాత్రం జరగుతుందో మనం అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.. పర్యావరణ కాలుష్యం ప్రస్తుతం జీవకోటికి పెనుముప్పుగా మారింది.. ఆధునిక యుగంలో టెక్నాలజీ ఎంత పెరిగిందో.. అంతే పర్యావరణ కాలుష్యం ప్రమాదం కూడా కొరలు చాస్తోంది. ప్రస్తుతం మానవాళితో పాటు సమస్త ప్రాణికోటి ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య.. కాలుష్యం.. ప్రధానంగా కాలుష్యాన్ని మూడు రకాలుగా విభజిస్తారు.. వాయు కాలుష్యం,...