AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold and Silver Price Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. స్థిరంగా కొనసాగుతున్న వెండి.. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలాఉన్నాయంటే

పసిడి ప్రియులకు ఊరటనిస్తూ.. నేడు కొంత మేర తగ్గింది. వాస్తవానికి 24 క్యారెట్ల బంగారం ధర ఎప్పుడో 56 వేల రూపాయలను క్రాస్ చేసింది. నేడు పసిడి ధర స్వల్పంగా తగ్గి 10. గ్రామల ధర రూ. 56,130 లకు చేరుకుంది. 

Gold and Silver Price Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. స్థిరంగా కొనసాగుతున్న వెండి.. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలాఉన్నాయంటే
Gold Price Hike 2023
Surya Kala
|

Updated on: Jan 11, 2023 | 6:52 AM

Share

భారత దేశంలో బంగారం, వెండి లోహాలను ఓ ఆస్తిగక్ఆ భావిస్తారు. ఆర్ధిక భరోసా కోసం ఈ లోహాల కొనుగోలుకు అత్యంత ప్రాధాన్యత ఉంది.  కరోనా తర్వాత బంగారం పై పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే బంగారం ధరల్లో హెచ్చ తగ్గులుంటాయి. దీని కారణం.. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, నగల మార్కెట్‌లతో సహా అనేక పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటాయి. దీంతో బంగారం ధర గత కొన్ని రోజులుగా వరసగా రెక్కలు వచ్చినట్లు దూసుకెళ్లింది. అయితే పసిడి ప్రియులకు ఊరటనిస్తూ.. నేడు కొంత మేర తగ్గింది. వాస్తవానికి 24 క్యారెట్ల బంగారం ధర ఎప్పుడో 56 వేల రూపాయలను క్రాస్ చేసింది. నేడు పసిడి ధర స్వల్పంగా తగ్గి 10. గ్రామల ధర రూ. 56,130 లకు చేరుకుంది.

పసిడి ధర నేడు (జనవరి 11) స్వల్పంగా తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ 10 గ్రాముల ధర నేడు రూ.150 తగ్గి రూ.51,450లకు చేరుకుంది. మరోవైపు  24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ కూడా స్వల్పంగా దిగివచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర నేడు రూ.160 తగ్గి రూ.56,130లకు వచ్చింది. ఈ నేపథ్యంలో నేడు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలతో సహా దేశంలో పసిడి వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

హైదరాబాద్ మార్కెట్‍లో నేడు పసిడి కొంతమేర దిగి వచ్చింది. 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ.51,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,130 వద్ద కొనసాగుతోంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన వరంగల్, విజయవాడ, విశాఖ పట్నంలోనూ కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు.. 

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.51,600 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ కాస్ట్ రూ. 56,290 వద్ద కొనసాగుతోంది.

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో  10 గ్రా.  22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ.51,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,130ల వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో  10 గ్రా.  22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ.52,370.. కాగా  24 క్యారెట్ల బంగారం ధర రూ.57,130ల వద్ద ఉంది.

ఇక వెండి విషయానికి వస్తే.. నిగత కొన్ని రోజుల వరకూ బంగారం దారిలోనే పయనించిన వెండి ధర నేడు స్థిరంగా కొనసాగుతోంది. నేడు (జనవరి 11వ తేదీ) కిలో వెండి ధర రూ.71,800గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.73,700లుగా కొనసాగుతుంది.

ఇకపై బంగారం ధరలు పెరుగుతాయా, మరింత తగ్గుతాయా అన్నది లోతుగా విశ్లేషించుకోవాల్సిందే. ముదుపరులు మళ్లీ బంగారం ధర పెరుగుతుంది అంటున్నారు. ఎందుకంటే దేశంలో బంగారానికి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఓ వైపు పెళ్లిళ్ల సీజన్ రానున్నది మరోవైపు ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. ఇవన్నీ కలిసి బంగారం కొనుగోళ్లు పెరిగేలా చేయనున్నాయని మార్కెట్ రంగ నిపుణులు అంచనావేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..