Gold Price Today: మహిళలూ ఇదే గోల్డెన్ ఛాన్స్.! మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
దసరా పండుగ ముందు మహిళలకు అద్దిరిపోయే గుడ్ న్యూస్. మొన్నటి దాకా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. గత నాలుగు రోజులుగా స్థిరంగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం(అక్టోబర్ 8) ఇండియన్ బులియన్ మార్కెట్‌లో మరోసారి బంగారం ధరలు భారీగా తగ్గాయి.
దసరా పండుగ ముందు మహిళలకు అద్దిరిపోయే గుడ్ న్యూస్. మొన్నటి దాకా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. గత నాలుగు రోజులుగా స్థిరంగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం(అక్టోబర్ 8) ఇండియన్ బులియన్ మార్కెట్‌లో మరోసారి బంగారం ధరలు భారీగా తగ్గాయి. అలాగే వెండి ధరలలో కూడా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రెండు రోజుల్లో తులం బంగారం ధర రూ. 230 మేరకు తగ్గింది. ఈ క్రమంలోనే దేశీయంగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గానూ రూ.77,440గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గానూ రూ.70,099గా ఉంది.
ఇది చదవండి: కిర్రాక్ బిజినెస్.. చిన్న ఖాళీ స్థలంతో లక్షల్లో ఆదాయం.. ఇంతకీ అదేంటంటే.?
దేశంలోని వివిధ మార్కెట్లలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
-
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,990గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,440గా ఉంది.
-
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,140గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,590గా ఉంది.
-
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,990గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,440గా ఉంది.
-
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,990గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,440గా ఉంది.
-
అటు చెన్నై బులియన్ మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,990గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,440గా ఉంది.
వెండి కూడా బంగారం బాటలోనే..
గడిచిన రెండు రోజులుగా వెండి ధరల్లోనూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా రెండు వేలకుపైగా పెరిగిన వెండి ధరలు.. మంగళవారం మరోసారి స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం కిలో వెండి రూ. 96,800గా ఉంది. ముంబై, పూణేలలో కిలో వెండి రూ. 96,800గా.. ఢిల్లీ, కోల్‌కతాలలో కిలో వెండి రూ. 96,900గా.. చెన్నై, హైదరాబాద్, కేరళ నగరాల్లో కిలో వెండి రూ. 1,02, 900గా ఉంది.
ఇది చదవండి: సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్‌ను వేలం వేస్తే.. ఎంతకు అమ్ముడైందో తెల్సా
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..