AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Himachal Pradesh: కాలుష్యం తగ్గించే దిశగా హిమాచల్ అడుగులు.. ఆర్టీసీకి మరో 327 ఒలెక్ట్రా బస్సులు

మన దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం గురించి ఇప్పటికే పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వాయు కాలుష్యం వలన దేశ రాజధాని డిల్లీ సహా అనేక ముఖ్య పట్టణాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీనికి కారణం ఎక్కువగా వాహనాలు, ఫ్యాక్టరీల్లో వెలువడే వ్యర్ధాలు గాలిలో కలవడం అని హెచ్చరిస్తున్నారు. ఈ నేపద్యంలో వాతావరణ పరిరక్షణ కోసం హిమాచల్ ప్రదేశ్ ముందస్తు చర్యలు చేపట్టింది. కాలుష్యరహిత బస్సుల వైపు హిమాచల్ ఆర్టీసీ మొగ్గుచూపుతుంది.

Himachal Pradesh: కాలుష్యం తగ్గించే దిశగా హిమాచల్ అడుగులు.. ఆర్టీసీకి మరో 327 ఒలెక్ట్రా బస్సులు
Olectra Greentech
Surya Kala
|

Updated on: Oct 08, 2024 | 7:30 AM

Share

మన దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం గురించి ఇప్పటికే పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వాయు కాలుష్యం వలన దేశ రాజధాని డిల్లీ సహా అనేక ముఖ్య పట్టణాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీనికి కారణం ఎక్కువగా వాహనాలు, ఫ్యాక్టరీల్లో వెలువడే వ్యర్ధాలు గాలిలో కలవడం అని హెచ్చరిస్తున్నారు. ఈ నేపద్యంలో వాతావరణ పరిరక్షణ కోసం హిమాచల్ ప్రదేశ్ ముందస్తు చర్యలు చేపట్టింది. కాలుష్యరహిత బస్సుల వైపు హిమాచల్ ఆర్టీసీ మొగ్గుచూపుతుంది. ఇందుకోసం హిమాచల్ రోడ్డు రవాణా సంస్థ పిలిచిన టెండర్లలో ఒలెక్ట్రా సంస్థ ఎల్‌-1గా నిలిచింది.

ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు హిమాచల్ రోడ్డు రవాణా సంస్థ పిలిచిన టెండర్లలో ఒలెక్ట్రా గ్రీన్టెక్ తక్కువ ధర కోట్ చేసి ఎల్ 1 బిడ్డర్‌గా నిలిచింది. హెచ్ఆర్టీసీ 327 విద్యుత్ బస్సుల కొనుగోలుకు తాజాగా టెండర్లు పిలిచింది. ఇందులో తొమ్మిది మీటర్ల బస్సులు 297, 12 మీటర్ల బస్సులు 30 ఉన్నాయి. ఒలెక్ట్రా గ్రీన్ టెక్, స్విచ్ మొబిలిటీ టెండర్లలో పాల్గొన్నాయి. టెండర్ ప్రక్రియ అనంతరం నిర్వహించిన సాంకేతిక పరీక్షల్లో రెండు సంస్థలు అర్హత సాధించాయి. అయితే తక్కువ ధర కోట్ చేసి ఒలెక్ట్రా సంస్థ ఎల్1గా నిలిచింది.

హిమాచల్ రాష్ట్ర ప్రజల అవసరాల నిమిత్తం బస్సులను కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్న ఆర్టీసీ త్వరలో ఆర్డర్ ఖరారు చేయనుంది. కాలుష్యం తగ్గించాలనే ఉద్దేశంతో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టిన రోడ్డు రవాణా సంస్థల్లో హెచ్ ఆర్టీసీ ఒకటి. 2017 సెప్టెంబర్లో ఈ సంస్థ విద్యుత్ బస్సులను తొలిసారి కొనుగోలు చేసింది. ఒలెక్ట్రా సంస్థ అపుడు 25 బస్సులను విక్రయించింది. ఆ బస్సులను కులుమనాలి – రోహ్తాంగ్ మధ్య ఆర్టీసీ నడుపుతోంది. మనాలి- రోహ్తాంగ్ మధ్య 13 వేల కిలోమీటర్ల ఎత్తులో ఈ బస్సులు నడుస్తున్నాయి.  ప్రపంచంలో ఈ ఎత్తులో ఒలెక్ట్రా విద్యుత్ బస్సులు నడుస్తూ రికార్డ్ సృష్టించాయి.

ఇవి కూడా చదవండి

హిమాచల్ కొండల్లో పర్యావరణాన్ని పరిరక్షించడంలో ఒలెక్ట్రా బస్సులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. హిమాచల్‌ ఆర్టీసీకి సరఫరా చేయనున్న బస్సులో ప్రయాణికుల సౌకర్యార్ధం అత్యాధునిక సౌకర్యాలను ఒలెక్ట్రా పొందుపరచనుంది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, ఎయిర్ సస్పెన్షన్, ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్ తో కూడిన డిస్క్ బ్రేక్ వ్యవస్థ ఇందులో ఉంటాయి. ఈ బస్సులకు ఒకసారి ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. డ్రైవర్తో కలిపి 31 మంది ఇందులో ప్రయాణించవచ్చు. 12 మీటర్ల బస్సులు ఒకసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఇందులో డ్రైవర్ తో కలిపి 38 మంది ప్రయాణించవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..