Business Idea: కిర్రాక్ బిజినెస్.. చిన్న ఖాళీ స్థలంతో లక్షల్లో ఆదాయం.. ఇంతకీ అదేంటంటే.?
స్కూల్ ఇంటర్వెల్ బ్రేక్.. ఎంప్లాయిస్ కాఫీ బ్రేక్.. బ్రేక్ ఏదైనా కూడా ఆకలి తీర్చుకోవడానికి చిన్న స్నాక్ కచ్చితంగా ఉండాల్సిందే. ఈ మధ్యకాలంలో బయట ఫుడ్ ఏమాత్రం బాగోలేదు. ఎక్కడ చూసినా నాసిరకమే. అది తింటే మనకే లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
స్కూల్ ఇంటర్వెల్ బ్రేక్.. ఎంప్లాయిస్ కాఫీ బ్రేక్.. బ్రేక్ ఏదైనా కూడా ఆకలి తీర్చుకోవడానికి చిన్న స్నాక్ కచ్చితంగా ఉండాల్సిందే. ఈ మధ్యకాలంలో బయట ఫుడ్ ఏమాత్రం బాగోలేదు. ఎక్కడ చూసినా నాసిరకమే. అది తింటే మనకే లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి తరుణంలో చాలామంది బయట స్నాక్స్ లేదా ఫాస్ట్ ఫుడ్ తినాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. వారికోసం మీరే ఆ స్నాక్స్ ఇంట్లో తయారు చేసి.. క్వాలిటీ అండ్ క్వాంటీటీతో అమ్మకాలు చేయవచ్చు. అదేనండీ.. అర్ధం కాలేదా.. రకరకాల స్నాక్స్, చిప్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఓ పనైపోతుంది.
ఈ వ్యాపారానికి పెట్టుబడి పెద్దగా అక్కర్లేదు. రిస్క్ తక్కువ.. లాభం ఎక్కువ. దీన్ని స్టార్ట్ చేయడానికి కావాల్సిందల్లా ఇంటిలోని చిన్న ఖాళీ స్థలం. స్థానికంగా వ్యాపారానికి అవసరమయ్యే మౌత్ పబ్లిసిటీ వస్తే చాలు. ఇక ఈ చిప్స్, స్నాక్స్ తయారీకి కూడా పెద్ద మెషిన్లు అక్కర్లేదు. కూరగాయలు కోసే కట్టర్, ఓ పెద్ద బాండీ, పెద్ద మూకుడు, నూనె, ఉప్పు, మసాలా.. ఇక పార్శిల్స్ చేసేందుకు చిన్న చిన్న కవర్ ప్యాకెట్లు అంతే.
మొదటిగా మీ ఇంటి చుట్టుప్రక్కల ఉన్న హోల్‌సేల్ షాపులలో అమ్మకం ప్రారంభించి.. ఆ తర్వాత మీ ఇంటిలోనే చిన్నగా షాప్ ఏర్పాటు చేయవచ్చు. మీ దగ్గర ఓ వ్యాన్ ఉంటే.. పార్శిల్స్ వేరే ప్రాంతాల్లో ఉన్న షాప్‌లకు కూడా అమ్మొచ్చు. సుమారు 10 కిలోల చిప్స్ అమ్మితే.. దాదాపుగా రూ. వెయ్యి వరకు మిగులుతుంది. ఇలా చూసుకుంటే.. రోజుకు నాలుగు వేల వరకు సంపాదించవచ్చు. క్వాలిటీ, క్వాంటిటీ రెండూ సరిగ్గా చూసుకుంటే.. మీ వ్యాపారంలో లాభాలు ఆర్జించవచ్చు.
ఇది చదవండి: ఒంటరిగా చూడటమే బెటర్.! ఓటీటీలో రచ్చ రచ్చ.. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..