AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YouTube Shorts: ఇక యూట్యూబ్‌ షార్ట్స్‌లో కీలక అప్‌డేట్‌.. ఇక నుంచి 3 నిమిషాల వీడియోలు!

YouTube చాలా మందికి ఆదాయ వనరు, జీవనోపాధి. యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బు సంపాదించే వారు మన ముందు చాలా మంది ఉన్నారు. కాలానుగుణంగా మార్పులు ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్‌ మరో కొత్త మార్పు చేయబోతోంది. ఇక నుంచి యూట్యూబ్‌లోని షార్ట్ విభాగంలో మూడు నిమిషాల వీడియోను చేర్చాలన్నది కంపెనీ ప్లాన్‌...

YouTube Shorts: ఇక యూట్యూబ్‌ షార్ట్స్‌లో కీలక అప్‌డేట్‌.. ఇక నుంచి 3 నిమిషాల వీడియోలు!
Youtube Shorts
Subhash Goud
|

Updated on: Oct 05, 2024 | 9:51 AM

Share

YouTube చాలా మందికి ఆదాయ వనరు, జీవనోపాధి. యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బు సంపాదించే వారు మన ముందు చాలా మంది ఉన్నారు. కాలానుగుణంగా మార్పులు ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్‌ మరో కొత్త మార్పు చేయబోతోంది. ఇక నుంచి యూట్యూబ్‌లోని షార్ట్ విభాగంలో మూడు నిమిషాల వీడియోను చేర్చాలన్నది కంపెనీ ప్లాన్‌. ఈ పద్ధతి యూట్యూబ్‌లో అక్టోబర్ 15, 2024 నుండి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రారంభంలో యూట్యూబ్‌ షార్ట్‌ల విభాగంలో 60-సెకన్ల వీడియోలు మాత్రమే ఉంది.

కొత్త మార్పు వినియోగదారులకు మరింత ప్రభావవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే సృష్టికర్తలు తమ ప్రేక్షకులతో 60 సెకన్ల వీడియో నుండి మూడు నిమిషాల వీడియో వరకు మరిన్ని ఆలోచనలను పంచుకోగలరు. ఇంతకుముందు యూట్యూబ్ షార్ట్‌లు టిక్ టోక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వంటి వాటితో పోటీ పడ్డాయి. ఇప్పుడు దానికి భిన్నంగా యూట్యూబ్‌ క్రియేటర్‌లు తమ కంటెంట్‌ను అభివృద్ధి చేయడానికి మరిన్ని సౌకర్యాలను అందించింది.

ఇది కూడా చదవండి: Gold Price Increase: యుద్ధ సమయంలో రూ.26 వేలు పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

అయితే ఈ మార్పు గతంలో అప్‌లోడ్ చేసిన వీడియోలపై ప్రభావం చూపదని కంపెనీ తెలియజేసింది. వీటన్నింటితో పాటు, కంటెంట్ సృష్టిని మరింత ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా చేయడానికి YouTube అనేక కొత్త ఫీచర్‌లను కూడా ప్రవేశపెడుతోంది. వీటిలో మొదటిది యూట్యూబ్‌ వీడియోలను రూపొందించడానికి టెంప్లేట్‌లను అందిస్తుంది. క్రియేటర్‌లు తమ వీడియోలను ట్రెండ్‌లలోకి చేర్చడానికి, జనాదరణ పొందిన కంటెంట్‌ను చేరుకోవడానికి ఇది మార్గాన్ని తెరుస్తుంది. Google DeepMind వీడియో మోడల్, Vio, ఈ సంవత్సరం చివరిలో Shortsలో విలీనం అవుతుందని కూడా నివేదికలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఇలా..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి