AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunaina Kejriwal: దిగ్గజ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ కుమార్తె కన్నుమూత.. కారణం ఇదే

ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె కమల్‌నయన్ బజాజ్ హాల్ అండ్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ సునైనా కేజ్రీవాల్ (53) మృతి చెందారు. క్యాన్సర్‌తో సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్న ఆమె ముంబైలో తన నివాసంలో శనివారం కన్నుమూశారు..

Sunaina Kejriwal: దిగ్గజ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ కుమార్తె కన్నుమూత.. కారణం ఇదే
Sunaina Kejriwal
Srilakshmi C
|

Updated on: Oct 08, 2024 | 6:55 AM

Share

ముంబై, అక్టోబర్‌ 8: ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె కమల్‌నయన్ బజాజ్ హాల్ అండ్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ సునైనా కేజ్రీవాల్ (53) మృతి చెందారు. క్యాన్సర్‌తో సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్న ఆమె ముంబైలో తన నివాసంలో శనివారం కన్నుమూశారు. సునైనాకు ఆమె భర్త, ఇద్దరు కుమారులు ఆర్యమాన్, నిర్వాన్‌ ఉన్నారు. ఆర్యమాన్ ప్రస్తుతం కొలంబియా యూనివర్సిటీలో జూనియర్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఎకనామిక్స్ చదువుతున్నారు. నిర్వాణ్ బాంబే ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏడవ తరగతి చదువుతున్నాడు. సునైనా భర్త మనీష్ కేజ్రీవాల్‌ కేదారా క్యాపిటల్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ పార్ట్‌నర్‌. సునైనా గత మూడేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు.

దాతృత్వం, కళల పట్ల ఆసక్తి ఉన్న ఆమె కమల్‌నయన్ బజాజ్ హాల్, ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్‌గా దేశ ఆర్థిక రాజధానిలో కళారంగాన్ని సుసంపన్నం చేయడంలో కృషి చేశారు. ఆమె పూణేలోని SNDT కాలేజీ నుండి టెక్స్‌టైల్స్‌లో స్కిల్స్‌ పొందారు. ముంబైలోని సోఫియా కాలేజీలో ఒక సంవత్సరం సిల్క్ స్క్రీన్ ప్రింటింగ్ కోర్సులో విద్యను అభ్యసించారు.

బజాజ్ కుటుంబం ఇప్పటికే దాతృత్వంలో ఉంది. అనేక ఛారిటబుల్ ట్రస్ట్‌లను కలిగి ఉంది. తన భర్త మనీష్‌తో కలిసి సునైనా కేదారా క్యాపిటల్‌ను స్థాపించారు. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిర్వహణలో ఆస్తులను కలిగి ఉంది. ఆమె ముంబైలోని భౌ దాజీ లాడ్ మ్యూజియం నుండి ‘ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ – మోడరన్ & కాంటెంపరరీ & క్యూరేటోరియల్ స్టడీస్’లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ చేశారు. బజాజ్ కుటుంబం మహాత్మా గాంధీ స్వాతంత్ర్య పోరాటంతో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంది. జమ్నాలాల్ బజాజ్ ఫౌండేషన్ ద్వారా దాతృత్వ వారసత్వాన్ని కొనసాగించింది. ఈ సంస్థ అనేక వారసత్వ ప్రదేశాలను పునరుద్ధరించడంలో కీలకపాత్ర పోషించింది. భావు దాజీ లాడ్ మ్యూజియం దాని ముఖ్యమైన ప్రాజెక్టులలో ఒకటి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.