AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banking Frauds: బ్యాంకింగ్ మోసాలకు చెక్.. త్వరలోనే అందుబాటులోకి సరికొత్త నెంబర్ సిరీస్

ఇటీవల కాలంలో పెరిగిన టెక్నాలజీ బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావడంతో నగదు డిపాజిట్, విత్ డ్రాతో పాటు నగదు బదిలీ సేవలు కూడా చాలా సౌకర్యంగా మారాయి. అయితే మంచి ఉన్న చోటే చెడు ఉంటుందన్న చందాన ఆన్‌లైన్ బ్యాంకింగ్ వినియోగించి చేసే మోసాల సంఖ్య కూడా పెరిగిపోయింది.

Banking Frauds: బ్యాంకింగ్ మోసాలకు చెక్.. త్వరలోనే అందుబాటులోకి సరికొత్త నెంబర్ సిరీస్
Cyber Fraudsters
Nikhil
|

Updated on: Sep 01, 2024 | 7:30 PM

Share

ఇటీవల కాలంలో పెరిగిన టెక్నాలజీ బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావడంతో నగదు డిపాజిట్, విత్ డ్రాతో పాటు నగదు బదిలీ సేవలు కూడా చాలా సౌకర్యంగా మారాయి. అయితే మంచి ఉన్న చోటే చెడు ఉంటుందన్న చందాన ఆన్‌లైన్ బ్యాంకింగ్ వినియోగించి చేసే మోసాల సంఖ్య కూడా పెరిగిపోయింది. ముఖ్యంగా ఫేక్ కాల్స్ ద్వారా కేటుగాళ్లు బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును మాయం చేస్తున్నారు. కాల్ చేసే నంబర్లు కూడా బ్యాంకుల అధికారిక నెంబర్లు అనేలా భ్రమ పెడుతూ మోసగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి మోసాలకు చెక్ పెట్టేలా భారత ప్రభుత్వం కీలక చర్యలను తీసుకుంటుంది. త్వరలో బ్యాంకులకు 160తో ప్రారంభమయ్యే కొత్త 10 అంకెల ఫోన్ నంబర్ సిరీస్‌ను అందించనుంది. 160 సిరీస్ నెంబర్‌తో ఫోన్స్ వస్తే అవి కచ్చితంగా బ్యాంకుల నుంచి అధికారికంగా వచ్చే ఫోన్స్ కింద భావించవచ్చు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అధికారిక సంస్థల నుంచి కాల్స్‌ను సులభంగా గుర్తించవచ్చు. ఈ ప్రకటన మేలోనే వెలువడినా తాజాగా ఈ నెంబర్ కోసం ప్రభుత్వం చర్యలను తీసుకుంటుంది. ఈ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత మోసగాళ్లు వ్యక్తులను మోసగించడం చాలా కష్టంగా ఉంటుంది. వినియోగదారులు చట్టబద్ధమైన కాల్స్‌ను సులభంగా గుర్తించవచ్చు. ప్రారంభంలో 160 సిరీస్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ ద్వారా నియంత్రించే సంస్థలు ఉపయోగించవచ్చు. స్టాండర్డిస్డ్ నంబరింగ్ ఫార్మాట్ వినియోగదారులకు పెట్టుబడులు కోరే లేదా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించే మోసపూరిత సంస్థలను సులభంగా గుర్తించడంలో సహాయపడుతుందని డీఓటీ  చెబుతుంది.

ప్రభుత్వం, రెగ్యులేటర్లు అయాచిత కాల్స్‌కు అధిక జరిమానాలు విధించే అవకాశం ఉంది. భవిష్యత్తులో, ఈ నంబరింగ్ వ్యవస్థలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, వివిధ టెలికాం ప్రొవైడర్లు రానున్నారు. అదనంగా స్పామ్ కాల్లను తగ్గించడానికి ప్రభుత్వం ఇతర చర్యలు తీసుకుంటోంది. ట్రాయ్ ప్రమోషనల్ కాల్స్ కోసం ఉపయోగించేలా 140 సిరీస్‌ నంబర్‌ను లాంచ్ చేసిన విధితమే. ఈ కొత్త కొత్త నంబర్లు 1600ABCXXX  ఉంటుంది. ఇక్కడ “ఏబీ” టెలికాం సర్కిల్‌ను సూచిస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..