AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్‌లో 5 స్టార్ సౌకర్యాలు.. ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Vande Bharat Sleeper Trains: వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కొత్త భారతీయ రైల్వే వందే భారత్ స్లీపర్ రైలు నమూనాను 1 సెప్టెంబర్ 2024 ఆవిష్కరించారు. దీనిని బీఈఎంఎల్‌ (BEML) రూపొందించింది. త్వరలో ఈ రైలు ట్రాక్‌పై పరుగులు పెట్టనుంది. కొత్త వందే భారత్ స్లీపర్ రైలు..

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్‌లో 5 స్టార్ సౌకర్యాలు.. ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Vande Bharat Sleeper Train
Subhash Goud
|

Updated on: Sep 01, 2024 | 7:18 PM

Share

Vande Bharat Sleeper Trains: వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కొత్త భారతీయ రైల్వే వందే భారత్ స్లీపర్ రైలు నమూనాను 1 సెప్టెంబర్ 2024 ఆవిష్కరించారు. దీనిని బీఈఎంఎల్‌ (BEML) రూపొందించింది. త్వరలో ఈ రైలు ట్రాక్‌పై పరుగులు పెట్టనుంది. కొత్త వందే భారత్ స్లీపర్ రైలు వందే భారత్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. ప్రయాణీకుల సౌకర్యాలు, వేగం, భద్రత పరంగా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే ఇది గొప్పదని తెలుస్తోంది. ఈ రైలుకు సంబంధించిన కొన్ని కొత్త చిత్రాలు బయటకు వచ్చాయి.

Vande Bharat Sleeper

Vande Bharat Sleeper

  • వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లు
  • ఏసీ 3 టైర్‌కు చెందిన 11 కోచ్‌లు
  • ఏసీ 2 టైర్‌కు చెందిన 4 కోచ్‌లు
  • ఏసీ ఫస్ట్ కోచ్‌లు ఉంటాయి.
  • ఈ రైలు మొత్తం 823 మంది ప్రయాణికుల బెర్త్ సామర్థ్యం.
  • ఏసీ 3 టైర్‌లో 611 మంది
  • ఏసీ 2 టైర్‌లో 188 మంది.
  • ఏసీ 1లో 24 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.
ఇవి కూడా చదవండి

రైలు వేగం

వందే భారత్ స్లీపర్ రైలు గరిష్ట వేగం గంటకు 160 కి.మీ. ఇది ఆటోమేటిక్ రైలు. భారతదేశం భారతీయ రైల్వేలు, బీఈఎఎల్‌ ప్రకారం.. వందే భారత్ స్లీపర్ రైలు ప్రపంచ స్థాయికి చేరుకుంది. యూరోపియన్ ప్రమాణాలు ఇందులో ఉన్నాయి. కొత్త రైలులో జీఎఫ్‌ఆర్‌పీ ప్యానెల్స్, ఆటోమేటిక్ ఔటర్ ప్యాసింజర్ డోర్లు, సెన్సార్ ఆధారిత ఇన్నర్ డోర్లు ఏర్పాటు చేశారు. భారతీయ రైల్వేలు కొత్త వందే భారత్ స్లీపర్ రైలు టాయిలెట్లను ఎర్గోనామిక్‌గా రూపొందించిందట. అంటే ఇక్కడ టాయిలెట్ల నుంచి ఎలాంటి వాసన రాకుండా ఏర్పాటు చేశారు. వందే భారత్ స్లీపర్ రైలు అనేక ప్రయాణికులకు అనుకూలమైన లక్షణాలను కలిగి ఉంది. ఇందులో USB ఛార్జింగ్, ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్, వికలాంగ ప్రయాణికుల కోసం ప్రత్యేక బెర్త్‌లు ఉన్నాయి.

Vande Bharat Sleeper

Vande Bharat Sleeper

వందే భారత్ స్లీపర్‌లలో క్రాష్ బఫర్‌లు, కప్లర్‌లు అమర్చారు. వందే భారత్‌లో ధూళి ప్రవేశించదు. అలాగే ప్రయాణ సమయంలో ప్రయాణికులు షాక్‌కు గురికారు. అంతే కాదు ఇందులో మాడ్యులర్ టాయిలెట్, మాడ్యులర్ ప్యాంట్రీ, డిస్‌ప్లే ప్యానెల్, సెక్యూరిటీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఫస్ట్ క్లాస్ ఏసీలో హాట్ వాటర్ షవర్ కూడా ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి: Cylinder Price Hike: వినియోగదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి