PAN Card: ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు ఉంటే ఏమవుతుంది?
వివిధ ప్రయోజనాల కోసం పాన్ కార్డ్ చాలా అవసరం. భారతదేశంలో ఆర్థిక లావాదేవీల కోసం పాన్ కార్డ్ తప్పనిసరి. ఇది 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్. ఈ పాన్ కార్డ్ ఆదాయపు పన్ను శాఖ ద్వారా రూపొంది ఉంటుంది. అయితే ఈ పాన్ కార్డ్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. నిర్దేశిత పరిమితికి మించి ఆదాయం..
వివిధ ప్రయోజనాల కోసం పాన్ కార్డ్ చాలా అవసరం. భారతదేశంలో ఆర్థిక లావాదేవీల కోసం పాన్ కార్డ్ తప్పనిసరి. ఇది 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్. ఈ పాన్ కార్డ్ ఆదాయపు పన్ను శాఖ ద్వారా రూపొంది ఉంటుంది. అయితే ఈ పాన్ కార్డ్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. నిర్దేశిత పరిమితికి మించి ఆదాయం ఉన్నవారు ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. 2.5 లక్షల రూపాయల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కోసం ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి పాన్ కార్డ్ అవసరం. పాన్ కార్డు లేకుండా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం సాధ్యం కాదు.
అంతేకాకుండా చాలా చోట్ల పాన్ కార్డ్ కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం. బ్యాంకు ఖాతా తెరవడానికి ప్రజలకు పాన్ కార్డు అవసరం. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు డీమ్యాట్ ఖాతా అవసరం. ఆ డీమ్యాట్ ఖాతాను తెరవడానికి పాన్ కార్డ్ కూడా అవసరం. 50 వేల రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలకు కూడా పాన్ కార్డ్ అవసరం. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ చేయడానికి కూడా పాన్ కార్డ్ అవసరం. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, ఎక్కువ పాన్ కార్డులను రూపొందించడం సాధ్యం కాదు. ఒక వ్యక్తి జీవితకాలంలో ఒక పాన్ నంబర్ మాత్రమే ఉపయోగించవచ్చు.
ఇది కూడా చదవండి: Cylinder Price Hike: వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
ఒకటి కంటే ఎక్కువ పాన్‌లను పొందడం లేదా కలిగి ఉండటం వల్ల రూ. 10,000 వరకు జరిమానా విధిస్తారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. అందువల్ల, ఒకటి కంటే ఎక్కువ పాన్‌లను నివారించడం చాలా ముఖ్యం. మీరు ఒకటి కంటే ఎక్కువ పాన్‌లను కలిగి ఉన్నట్లయితే, మీరు తక్షణమే అదనపు పాన్‌ను రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. అదనపు పాన్‌కార్డును ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు సరెండర్ చేయాల్సి ఉంటుంది. లేకుంటే చట్ట రీత్య తీసుకునే చర్యలకు మీరు బాధ్యులు అవుతారు.
ఇది కూడా చదవండి: Google Pay UPI: బ్యాంక్ ఖాతా లేకుండా యూపీఐ చెల్లింపు.. గూగుల్‌పేలో కొత్త ఫీచర్!