AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget Cars: బడ్జెట్ కార్లల్లో టాప్ అవే.. మైలేజ్‌ విషయంలో వీటికి ఏ కారు సాటిరాదంతే..!

భారతదేశంలో బడ్జెట్ పద్మనాభాలు ఎక్కువగా ఉంటారు. ఏ పని చేయాలన్నా బడ్జెట్ అంచనా మేరకే చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలా మంది కార్ల కొనుగోలుదారులైతే కచ్చితంగా బడ్జెట్‌లోనే మంచి ఫీచర్స్‌తో పాటు సూపర్ మైలేజ్‌ను ఇచ్చే కార్ల కోసం వెతుకుతూ ఉంటారు. అయితే మారుతున్న టెక్నాలజీ కారణంగా అధిక ఫీచర్స్‌తో వచ్చే కార్లు ఉంటున్నాయి.

Budget Cars: బడ్జెట్ కార్లల్లో టాప్ అవే.. మైలేజ్‌ విషయంలో వీటికి ఏ కారు సాటిరాదంతే..!
Budget Cars
Nikhil
|

Updated on: Sep 01, 2024 | 7:00 PM

Share

భారతదేశంలో బడ్జెట్ పద్మనాభాలు ఎక్కువగా ఉంటారు. ఏ పని చేయాలన్నా బడ్జెట్ అంచనా మేరకే చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలా మంది కార్ల కొనుగోలుదారులైతే కచ్చితంగా బడ్జెట్‌లోనే మంచి ఫీచర్స్‌తో పాటు సూపర్ మైలేజ్‌ను ఇచ్చే కార్ల కోసం వెతుకుతూ ఉంటారు. అయితే మారుతున్న టెక్నాలజీ కారణంగా అధిక ఫీచర్స్‌తో వచ్చే కార్లు ఉంటున్నాయి. కానీ మైలేజ్ విషయంలో గతంలో వచ్చే కార్లల్లా ఉండడం లేదు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో వివిధ కార్లు మైలేజ్, ఫీచర్ల పరంగా వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఆ కార్లు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం. 

హ్యుందాయ్ ఐ 20 ఎన్ లైన్

హ్యుందాయ్ ఐ 20 ఎన్ లైన్ కారు రూ.9.99 లక్షలు నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు ఒక లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. సూపర్ ఫీచర్స్‌తో 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డీసీటీతో అందుబాటులో ఉంటుంది. హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ 118 బీహెచ్‌పీ పవర్, 172 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టాటా ఆల్టోజ్ రేసర్

టాటా ఆల్టోజ్ రేసర్ రూ.9.49 లక్షల ధరతో అందుబాటులో ఉంటుంది. ఈ కారు హ్యూందాయ్ ఐ 20 ఎన్ లైన్‌తో పోలిస్తే ఫీచర్ల పరంగా ఆకట్టుకుంటుంది. ఆల్టోజ్ రేసర్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్‌తో 1.2 లీటర్ ఇంజన్‌తో వస్తుంది. ఈ కారు 118 బీహెచ్‌పీ పవర్ 170 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మారుతీ సుజుకి ఫ్రాంక్స్

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ప్రస్తుత భద్రతా మార్కెటింగ్ కారణంగా కాస్త వెనుకబడి ఉంది. అయితే ఈ కారు 1.0 లీటర్ బూస్టర్ జెట్ ఇంజిన్‌తో వస్తుంది. అలాగే ఈ కారు 99 బీహెచ్‌పీ పవర్, 148 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టర్బో ఇంజిన్‌తో వచ్చే మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ధర రూ.9.72 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. 

సిట్రోయెన్ సీ3

షైన్ ట్రిమ్‌లోని సిట్రోయెన్ సీ3 ప్రారంభ ధర రూ.8.09 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ప్యూర్ టెక్ 110 ఇంజన్ షైన్ ట్రిమ్ స్థాయిలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్యూరెటెక్ 110 ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్‌లో 108 బిహెచ్‌పీ పవర్, 190 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు రెండు ట్రాన్స్ మిషన్ ఎంపికలు 6 గేర్‌లతో వస్తాయి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..