AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BGauss RUV350: ఎదురుచూపులకు ఫుల్ స్టాప్.. డెలివరీలకు ఇక వేళాయె..

అలాంటి వాటిల్లో బీగాస్ కంపెనీ కూడా ఒకటి. ఈ కంపెనీ నుంచి తన మొదటి స్కూటర్ ను కొంత కాలం క్రితమే ప్రకటించింది. దీని పేరు బీగాస్ ఆర్‌యూవీ350 ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ఉత్పత్తిని ఇప్పుడు ప్రారంభించింది. మహారాష్ట్రలోని చకన్ ప్లాంట్‌లో వీటిని తయారు చేస్తోంది. ఈ స్కూటర్‌ను ప్రీ-ఆర్డర్ చేసిన కస్టమర్‌లకు డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి.

BGauss RUV350: ఎదురుచూపులకు ఫుల్ స్టాప్.. డెలివరీలకు ఇక వేళాయె..
Bgauss Ruv350
Madhu
|

Updated on: Sep 01, 2024 | 3:54 PM

Share

ఎలక్ట్రిక్ స్కూటర్లకు మన భారతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. అందుకే పెద్ద పెద్ద కంపెనీలతో పాటు స్టార్టప్ లు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తున్నాయి. అలాంటి వాటిల్లో బీగాస్ కంపెనీ కూడా ఒకటి. ఈ కంపెనీ నుంచి తన మొదటి స్కూటర్ ను కొంత కాలం క్రితమే ప్రకటించింది. దీని పేరు బీగాస్ ఆర్‌యూవీ350 ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ఉత్పత్తిని ఇప్పుడు ప్రారంభించింది. మహారాష్ట్రలోని చకన్ ప్లాంట్‌లో వీటిని తయారు చేస్తోంది. ఈ స్కూటర్‌ను ప్రీ-ఆర్డర్ చేసిన కస్టమర్‌లకు డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. బీగాస్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ కబ్రా మాట్లాడుతూ తమ స్కూటర్ ఉత్పత్తిని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో అలు బీగాస్ ఆర్‌యూవీ350 ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకత ఏమిటి?

ఆర్‌యూవీ350 ఎలక్ట్రిక్ స్కూటర్ అసాధారణమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుందని బీగాస్ కంపెనీ ప్రకటించింది. అలాగే విస్తారమైన స్టోరేజీ స్థలాన్ని అందిస్తుందని పేర్కొంది. రైడర్ యుటిలిటీని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన ఈ స్కూటర్ లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ఒకసారి పూర్తి చార్జ్‌పై 145 కిమీల పరిధిని అందిస్తుంది. స్కూటర్ గరిష్టంగా 75 కిమీ/గం వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో మూడు విభిన్న నిల్వ ప్రాంతాలు ఉన్నాయి. ఇది రైడర్‌లకు ముఖ్యమైన సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ స్కూటర్ అధునాతన ఫీచర్లు, అద్భుతమైన డిజైన్‌తో వస్తుంది. ఈ స్కూటర్16-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. తక్కువ ప్లాస్టిక్ వాడకంతో మెటల్ బాడీని కలిగి ఉంటుంది. అధిక-పనితీరు గల ఇన్‌వీల్ హైపర్ డ్రైవ్ మోటార్ తో వస్తుంది. మరిన్ని స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది.

బీగాస్ ఆర్‌యూవీ350 ఫీచర్లు..

బీగాస్ ఆర్‌యూవీ350 ఎలక్ట్రిక్ స్కూటర్ 90 శాతం లోకల్ గా తయారు చేసిన విడి భాగాలతోనే దీనిని తయారు చేశారు. కొన్ని భాగాలు మాత్రమే దిగుమతి చేసుకున్నారు. స్కూటర్ మెటల్ బాడీని కలిగి ఉంది. ట్యూబ్‌లెస్ టైర్‌లతో 16-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. బూట్‌లో 20 లీటర్లు, ముందు భాగంలో 2.2 లీటర్లు, ఫుట్ ఫ్లోర్ కింద అదనంగా 4.5 లీటర్ల నిల్వ సామర్థ్యం కలిగి ఉంటుంది. టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ నోటిఫికేషన్‌లు, లైవ్ వెహికల్ ట్రాకింగ్, జియో-ఫెన్సింగ్, డ్యూయల్ థీమ్‌లు, ఆటోమేటిక్ డిస్‌ప్లేకు మద్దతు ఇచ్చే 5-అంగుళాల టీఎఫ్టీ స్క్రీన్ (బేస్ వేరియంట్‌లో అందుబాటులో లేదు) సహా అనేక ఆధునిక ఫీచర్లను కూడా స్కూటర్ అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!