Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. వినాయక చవితికి భారీగా ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు..

విద్య, ఉద్యోగం, వ్యాపారం కోసం బయట ప్రాంతాలలో స్థిరపడిన వారందరూ పండగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. దీంతో రైళ్లకు వివరీతమైన రద్దీ ఏర్పడుతోంది. బెర్త్ కన్ఫార్మ్ కాకపోతే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్య పరిష్కారానికి భారతీయ రైల్వే చర్యలు తీసుకుంది. గణేశ్ ఉత్సవాల సందర్భంగా 342 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ప్రకటించింది.

Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. వినాయక చవితికి భారీగా ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు..
Train
Follow us

|

Updated on: Sep 01, 2024 | 4:54 PM

దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. సెప్టెంబర్7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే చవితి వేడుకలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాడవాడలా చవితి పందిళ్లను సిద్ధం చేస్తున్నారు. గణపతి విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం కోసం బయట ప్రాంతాలలో స్థిరపడిన వారందరూ పండగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. దీంతో రైళ్లకు వివరీతమైన రద్దీ ఏర్పడుతోంది. బెర్త్ కన్ఫార్మ్ కాకపోతే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్య పరిష్కారానికి భారతీయ రైల్వే చర్యలు తీసుకుంది. గణేశ్ ఉత్సవాల సందర్భంగా 342 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ప్రకటించింది.

వినాయక చవితికి ప్రత్యేక రైళ్లు..

గణేశ్ చతుర్థి కోసం 342 ప్రత్యేక రైళ్లను నడపనునట్టు ఆ శాఖ మంత్రి వైష్ణవీ అశ్విన్ తెలిపారు. ముంబైలోని బాంద్రా టెర్మినల్ నుంచి గోవాలోని మడ్గావ్ మధ్య రెండు వారాల రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ విషయం తెలిపారు. ప్రత్యేక రైళ్లు ముంబై నుంచి కొంకణ్ మార్గంలో నడుస్తాయన్నారు. వినాయక చవితి సందర్భంగా ముంబై నుంచి కొంకణ్ ప్రాంతానికి పెద్దసంఖ్యలో ప్రజలు వెళతారు. ఆ సమయంలో ఆ రూట్ లో విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పండగ జరుపుకొవడానికి వెళుతున్న వారందరూ సీట్లలో కూర్చుని సుఖం ప్రయాణం చేసే వీలు కల్పించింది. వినాయక చవతి ఉత్సవాలు సెప్టెంబర్ 7 నుంచి పది రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా ముంబై నుంచి కంకణ్ రూట్ లో 300 ప్రత్యేక రైళ్లను నడపాలనే డిమాండ్ ఉంది. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆ సంఖ్యను 342కి పెంచారు. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రి, స్థానిక ఎంపీ పీయూష్ గోయల్ ముంబై పశ్చిమ శివారు నుంచి కొంకణ్ ప్రాంతం మధ్య నేరుగా కనెక్టివిటీని అందించే రైలును ప్రారంభించారు.

రైల్వే ప్రాజెక్టులు..

ముంబైలోని సబర్బన్ రైలు నెట్‌వర్క్ ను గణనీయంగా మెరుగుపర్చడానికి 12 మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పనకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం వీటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులలో సీఎస్ఎంటీ-కుర్లా 5, 6వ లైన్ (రూ. 891 కోట్లు), ముంబై సెంట్రల్-బోరివలి 6వ లైను (రూ. 919 కోట్లు), గోరెగావ్ నుంచి బోరివలి వరకు హార్బర్ లైన్ పొడిగింపు (రూ. 826 కోట్లు), బోరివలి-విరార్ 5, 6వ లైన్లు (రూ. రూ. 2,184 కోట్లు), విరార్-దహాను 3, 4వ లైన్లు (రూ. 3,587 కోట్లు), పన్వేల్-కర్జాత్ సబర్బన్ కారిడార్ (రూ. 2,782 కోట్లు), ఐరోలి-కాల్వ ఎలివేటెడ్ సబర్బన్ కారిడార్ (రూ. 476 కోట్లు), కళ్యాణ్- అసంగాన్ 4వ లైన్ (రూ1, 75 కోట్లు), కళ్యాణ్-బద్లాపూర్ 3, 4వ లైన్ (రూ. 1,510 కోట్లు), కళ్యాణ్-కాసరా 3వ లైన్ (రూ. 792 కోట్లు), నైగావ్ – జుహీచంద్ర డబుల్ కార్డ్ లైన్ (రూ.176 కోట్లు), నిలజే-కోపర్ డబుల్ కార్డ్ లైన్ (రూ. 338 కోట్లు) ఉన్నాయి.

బడ్జెట్లో ప్రాధాన్యం..

మహారాష్ట్రలో రైల్వే నెట్‌వర్క్ అభివృద్ధికి 2014కి ముందు బడ్జెట్ కేటాయింపులు రూ. 1,171 కోట్లు కాగా, 2024-25లో వాటిని రూ.15,940 కోట్లకు పెంచారు. అంటే దాదాపు 13 రెట్లు అధికం చేశారు. గత పదేళ్లలో మహారాష్ట్రలో 1,830 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌లు వేశారు. ప్రస్తుతం రూ. 81,580 కోట్ల పెట్టుబడితో 5,877 కిలోమీటర్ల విస్తీర్ణంలో 41 రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రయాణికులకు శుభవార్త.. వినాయక చవితికి భారీగా ప్రత్యేక రైళ్లు..
ప్రయాణికులకు శుభవార్త.. వినాయక చవితికి భారీగా ప్రత్యేక రైళ్లు..
విద్యుత్‌ శాఖలో 3 వేల ఉద్యోగాలకు వచ్చే నెలలో నోటిఫికేషన్‌..!
విద్యుత్‌ శాఖలో 3 వేల ఉద్యోగాలకు వచ్చే నెలలో నోటిఫికేషన్‌..!
250 ఏళ్ల నాటి ఆలయాన్ని వదిలి పెట్టని కేటుగాళ్ళు..!
250 ఏళ్ల నాటి ఆలయాన్ని వదిలి పెట్టని కేటుగాళ్ళు..!
'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
పవన్‌కు వెరైటీగా బర్త్ డే విషెస్ తెలిపిన 800 మంది విద్యార్థులు
పవన్‌కు వెరైటీగా బర్త్ డే విషెస్ తెలిపిన 800 మంది విద్యార్థులు
బ్యాంక్ ఖాతా లేకుండా యూపీఐ చెల్లింపు.. గూగుల్‌పేలో కొత్త ఫీచర్‌!
బ్యాంక్ ఖాతా లేకుండా యూపీఐ చెల్లింపు.. గూగుల్‌పేలో కొత్త ఫీచర్‌!
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
ఒకటి కన్నా ఎక్కువ వాట్సాప్ ఖాతాలు వాడేవారికి అదిరిపోయే న్యూస్..
ఒకటి కన్నా ఎక్కువ వాట్సాప్ ఖాతాలు వాడేవారికి అదిరిపోయే న్యూస్..
ఇకపై ఇంగ్లిస్‌ మీడియంలోనూ TGPSC గ్రూప్‌ 1 పాఠాలు
ఇకపై ఇంగ్లిస్‌ మీడియంలోనూ TGPSC గ్రూప్‌ 1 పాఠాలు
లంకల్లో చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటున్న గొర్రెల కాపరులు..!
లంకల్లో చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటున్న గొర్రెల కాపరులు..!
'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!
చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.