BSNL Plan: బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే ఆఫర్.. కేవలం రూ.99తో ఏడాది పాటు వ్యాలిడిటీ.. పూర్తి వివరాలు
టెలికాం రంగంలో పోటీ పెరిగిపోతోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలతో పాటు ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ కూడా పోటీ పడుతోంది..
టెలికాం రంగంలో పోటీ పెరిగిపోతోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలతో పాటు ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ కూడా పోటీ పడుతోంది. తన కస్టమర్ల కోసం మరో బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. తక్కువ రీఛార్జ్ ప్లాన్‌తో ఎక్కువ వ్యాలిడిటీతో అందుబాటులోకి తీసుకువచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకునేందుకు ఏడాది పాటు వ్యాలిడిటీ కల్పిస్తోంది. ఇందు కోసం రూ.99 ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఈ రీఛార్జ్‌తో 365 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. నెలకు 300 నిమిషాల వరకు ఉచిత కాలింగ్, 3జీబీ డేటా, 30ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా సిమ్ ఏడాది పాటు యాక్టివ్‌గా ఉంటుంది. ఇతర బేసిక్ ప్లాన్ ఎలాంటివి తీసుకోవాల్సి అవసరం లేదు.
కస్టమర్లకు షాకిచ్చిన ఎయిర్‌టెల్
ఇటీవల ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు షాకిచ్చింది. కనీస రీఛార్జ్ ప్లాన్ రూ.99 ఉండగా, ప్రస్తుతం ఏకంగా రూ.150కి పెంచేసింది. దాదాపు 57 శాతం వరకు ప్లాన్ ధరను పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్‌లో 1జీబీ డేటా, 300 ఎస్‌ఎంఎస్‌లు, 200ఎంబీ డేటాతో 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ తీసుకువచ్చింది. కాగా, ఇవే కాకుండా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ వంటి టెలికాం సంస్థలు వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు రకరకాల రీఛార్జ్ ప్లాన్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. తక్కువ ధరల్లోనే రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకువస్తూ కస్టమర్లను పెంచుకుంటున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి