Business Ideas: ఉన్న ఊర్లోనే నెలకు రూ. లక్ష సంపాదన.. ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇక తిరుగుండదు
ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో ఎంత ఎక్కువ సంపాదించినా.. అది తక్కువగానే కనిపిస్తుంది. ప్రతీరోజూ పెరుగుతూపోతోన్న ఖర్చులు, ధరల పెరుగుదల వెరిసి.. మనం రెండు చేతులతో ఎంత సంపాదించినా.. మొదటి వారం ముగిసేసరికి డబ్బులు కనిపించట్లేదు. దీంతో సైడ్ ఇన్‌కమ్ కోసం..
ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో ఎంత ఎక్కువ సంపాదించినా.. అది తక్కువగానే కనిపిస్తుంది. ప్రతీరోజూ పెరుగుతూపోతోన్న ఖర్చులు, ధరల పెరుగుదల వెరిసి.. మనం రెండు చేతులతో ఎంత సంపాదించినా.. మొదటి వారం ముగిసేసరికి డబ్బులు కనిపించట్లేదు. దీంతో సైడ్ ఇన్‌కమ్ కోసం తాపత్రయపడుతుంటారు చాలామంది. వేరే పని లేదా పార్ట్‌టైం జాబ్, వ్యాపారం చేస్తూ సంపాదన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో మీకోసం ఓ బిజినెస్ ప్లాన్ ముందుకు తీసుకొచ్చేశాం. తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ లాభాలు ఆర్జించే వ్యాపారాల మార్గాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
ఫుడ్ బిజినెస్.. ఇప్పుడు దేశమంతా లాభసాటిగా సాగే వ్యాపారం. దీనిని కేవలం రూ. 10 వేల పెట్టుబడితో స్టార్ట్ చేయవచ్చు. ఇంట్లోనే కూర్చుని డబ్బులు సంపాదించే మార్గాల్లో.. యూట్యూబ్ వీడియోలు బెస్ట్ ఆప్షన్. ఫుడ్ తయారీలో మీకు అనుభవం ఉంటే.. ఫుడ్ వీడియోస్ ద్వారా మీరు లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చు. ఈకాలంలో చాలామంది ఫుడ్ వ్లోగ్స్ ద్వారా తిరుగులేని సంపాదన ఆర్జిస్తున్నారు.
అలాగే అటు ఆన్‌లైన్ ట్యూటరింగ్ క్లాసుల ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. మీరు ఆన్‌లైన్ క్లాసులు చెబుతూ.. యూట్యూబ్ వీడియోలు అప్‌లోడ్ చేయడమే కాదు.. కొన్నిరకాల వెబ్‌సైట్స్‌లో మీ టీచింగ్ సేవలను అందించే ద్వారా లాభాలు ఆర్జించవచ్చు. ఇలా చేయడం ద్వారా మీ స్కిల్స్ పెంపొందించుకోవడమే కాదు.. ఇతరులకు కూడా మీ సలహాలు ఉపయోగపడతాయి. ఓ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. మీ ఛానెల్ మార్కెటింగ్‌కు కొంత డబ్బు ఉపయోగిస్తే.. అది మీకు సబ్‌స్క్రైబర్లు పెంచడానికి వినియోగం అవుతుంది.
ఇది చదవండి: అరెకరం భూమి ఉంటే చాలు.. నెలకు రూ. 2 లక్షలు గ్యారెంటీ.! అదేంటంటే
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..