IND Vs ENG: ‘రోహిత్, బుమ్రా కాదు.. ఇంగ్లాండ్‌ను భయపెట్టేది ఆ ప్లేయరే..’
మరికొద్ది గంటల్లో భారత్, ఇంగ్లాండ్ మధ్య టీ20 వరల్డ్‌కప్ 2024 రెండో సెమీఫైనల్ జరగనుంది. గయానా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ టీమిండియాకు చాలా కీలకం అని చెప్పొచ్చు. సూపర్-8లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన రోహిత్ సేన.. బట్లర్ అండ్ గ్యాంగ్‌ను ఓడిస్తే.. ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నట్టే.
మరికొద్ది గంటల్లో భారత్, ఇంగ్లాండ్ మధ్య టీ20 వరల్డ్‌కప్ 2024 రెండో సెమీఫైనల్ జరగనుంది. గయానా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ టీమిండియాకు చాలా కీలకం అని చెప్పొచ్చు. సూపర్-8లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన రోహిత్ సేన.. బట్లర్ అండ్ గ్యాంగ్‌ను ఓడిస్తే.. ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నట్టే. అందుకే రోహిత్ శర్మ తన అస్త్రశస్త్రాలను సిద్దం చేస్తున్నాడు. సెమీస్‌లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. ఈ తరుణంలో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా కాదు.. ఇంగ్లీష్ టీమ్‌ను భయపెట్టేది ఆ ప్లేయర్ అంటూ మాట్లాడాడు.
రోహిత్ శర్మ కంటే అతడే డేంజరస్ బ్యాటర్ అని.. క్రీజులో కుదురుకున్నాడంటే ఇంగ్లీష్ జట్టు పని అయిపోయినట్టేనని.. బట్లర్ పేర్కొన్నాడు. మరి ఆ ప్లేయర్ మరెవరో కాదు.. విరాట్ కోహ్లీ. ఐసీసీ టోర్నీల్లో ఇప్పటిదాకా పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లీ.. ఈసారి పూర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. హయ్యస్ట్ రన్ స్కోరింగ్ లిస్టులో ఎప్పుడూ అగ్రస్థానంలో నిలిచే కోహ్లీ.. ఈసారి అట్టడుగున నిలిచాడు. అయినా సరే.! ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ అండ్ కోను భయపెడుతున్నాడు. విరాట్ ఆటతీరును ఎన్నో ఏళ్లుగా గమనిస్తున్నానని.. మ్యాచ్ ఏదైనా.. చేజ్ ఎంతైనా అతడ్ని మించిన కాంపిటీటర్ మరొకడు లేదన్నాడు జోస్ బట్లర్.
ప్రస్తుతం ఫాంలేమితో సతమతమవుతున్నా.. విరాట్ కోహ్లీని తక్కువ అంచనా వెయ్యట్లేదని అన్నాడు బట్లర్. రోజు తనదైతే.. మ్యాచ్‌ను ప్రత్యర్ధి జట్టు నుంచి లాగేసుకోవడం కింగ్ కోహ్లీ తత్త్వం అని పేర్కొన్నాడు ఇంగ్లీష్ జట్టు బౌలర్ జోఫ్రా ఆర్చర్. అటు విల్ జాక్స్ కూడా కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తాడు. కింగ్ కోహ్లీ బరిలోకి దిగితే 150 శాతం ఎఫర్ట్ పెడతాడని.. ఓటమిని అస్సలు ఒప్పుకోదు అని జాక్స్ స్పష్టం చేశాడు. కోహ్లీ తిరిగి ఫాంలోకి రావాలంటే ఒక్క మ్యాచ్ చాలు అంటూ ఇంగ్లీష్ జట్టు ప్లేయర్స్ విరాట్‌పై ప్రశంసలు కురిపించారు.
ఇది చదవండి: సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. ట్రోఫీ దక్కేది ఏ జట్టుకో తెలుసా.?
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..