AP News: చిల్డ్‌ బీర్‌తో చిల్‌ అవుదామనుకున్నాడు.. సీసా ఓపెన్ చేయకుండానే కళ్లు బైర్లు కమ్మాయి

చిల్డ్ బీర్ కొనుక్కుని ఫుల్లుగా చిల్ అవుదామనుకున్నాడు ఓ మందుబాబు. ఎంచక్కా స్థానికంగా ఉండే మద్యం షాపుకు వెళ్లాడు. డబ్బులు ఎంతైనా పర్లేదు.. ఓ చిల్డ్ బీర్ ఇమ్మని షాప్‌వాడిని అడిగాడు. ఇక ఆ బీర్ తీసుకోగానే మందుబాబుకు కిక్కెక్కినంత పనైంది. అందులో కనిపించింది..

AP News: చిల్డ్‌ బీర్‌తో చిల్‌ అవుదామనుకున్నాడు.. సీసా ఓపెన్ చేయకుండానే కళ్లు బైర్లు కమ్మాయి
Ap News
Follow us

|

Updated on: Jun 26, 2024 | 12:48 PM

చిల్డ్ బీర్ కొనుక్కుని ఫుల్లుగా చిల్ అవుదామనుకున్నాడు ఓ మందుబాబు. ఎంచక్కా స్థానికంగా ఉండే మద్యం షాపుకు వెళ్లాడు. డబ్బులు ఎంతైనా పర్లేదు.. ఓ చిల్డ్ బీర్ ఇమ్మని షాప్‌వాడిని అడిగాడు. ఇక ఆ బీర్ తీసుకోగానే మందుబాబుకు కిక్కెక్కినంత పనైంది. అందులో కనిపించింది చూసి దెబ్బకు షాక్ అయ్యాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా డోన్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

వివరాల్లోకి వెళ్తే.. డోన్‌కు చెందిన ఓ యువకుడు.. బేతంచెర్ల సర్కిల్‌లో ఉన్న వైన్ షాప్‌లో చిల్డ్ బీర్ కొనుగోలు చేశాడు. ఆ బీర్ బాటిల్ తీసుకుని.. మూత ఓపెన్ చేద్దామని అనుకున్న అతడికి అందులో ఏదో తెల్లగా కనిపించింది. తీరా అది ఏమై ఉంటుందోనని మొబైల్ ఫోన్‌కి ఉన్న టార్చ్ లైట్ వేసి చూడగా.. అదొక ప్లాస్టిక్ స్పూన్‌గా గుర్తించాడు.

వెంటనే ఈ విషయంపై సదరు యువకుడు బీర్ బాటిల్ కొనుగోలు చేసిన షాప్ దగ్గరకు వెళ్లి.. సిబ్బందిని ప్రశ్నించగా.. తమకు ఏమి తెలియదంటూ.. మాట దాటవేయడమే కాదు.. ఏ సంబంధం లేదని తేల్చేశారు. తాము కేవలం విక్రయించేవారిని మాత్రమేనని.. తయారు చేసేవాళ్లం కాదని స్పష్టం చేశారు. అటు సెబ్ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా.. వారు సరిగ్గా స్పందించలేదట. దీంతో తిరిగి మద్యం దుకాణం దగ్గరకు వెళ్లి.. అక్కడ ఆందోళన చేపట్టాడు సదరు యువకుడు. ఈ బీర్ బాటిల్‌లో ప్రస్తుతం స్పూన్ మాత్రమే వచ్చిందని.. అది కాకుండా వేరేది వచ్చి ఉంటే.. తాము అనారోగ్యం పాలయ్యేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: జాతిరత్నం అండీ బాబూ.. వీడి ఆన్సర్ పేపర్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ట్యాబ్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? వన్‌ప్లస్‌ నుంచి కొత్త
ట్యాబ్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? వన్‌ప్లస్‌ నుంచి కొత్త
బెడ్‌ రూమ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? జాగ్రత్త..
బెడ్‌ రూమ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? జాగ్రత్త..
వైసీపీ ఆఫీసులకు వరుస నోటీసులు.. ఏపీ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..
వైసీపీ ఆఫీసులకు వరుస నోటీసులు.. ఏపీ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..
ఎన్ని రోజుల తర్వాత స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి?
ఎన్ని రోజుల తర్వాత స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి?
అతిగా కాఫీ తాగితే అనర్ధాలు తప్పవు.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలంటే
అతిగా కాఫీ తాగితే అనర్ధాలు తప్పవు.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలంటే
రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తరచూ అలసటగా.. బలహీనంగా అనిపిస్తుందా? ఈ బ్లడ్‌ టెస్ట్ చేయించుకోండి
తరచూ అలసటగా.. బలహీనంగా అనిపిస్తుందా? ఈ బ్లడ్‌ టెస్ట్ చేయించుకోండి
తక్కువ ధరలో మంచి కార్ల కోసం చూస్తున్నారా.? బెస్ట్ ఆప్షన్స్‌ ఇవే..
తక్కువ ధరలో మంచి కార్ల కోసం చూస్తున్నారా.? బెస్ట్ ఆప్షన్స్‌ ఇవే..
పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకున్న తల్లి
పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకున్న తల్లి
లవ్లీ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
లవ్లీ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..