AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: జాతిరత్నం అండీ బాబూ.. వీడి ఆన్సర్ పేపర్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే

మీమ్స్ క్రియేట్ చేయడం ఓ ఆర్ట్. వీటిని ఎప్పటికప్పుడు సరికొత్తగా క్రియేట్ చేసే కంటెంట్ క్రియేటర్ల తెలివిని మెచ్చుకోవాల్సిందే. ఇంటర్నెట్‌లో ఫన్నీ మీమ్స్, రోస్టింగ్ వీడియోలు తరచూ తెగ హల్చల్ చేస్తుంటాయి. ఇదిలా ఉంటే.. ఎగ్జామ్స్‌లో లేదా క్లాస్ టెస్టుల్లో స్టూడెంట్స్ రాసే ఫన్నీ ఆన్సర్స్..

Viral Video: జాతిరత్నం అండీ బాబూ.. వీడి ఆన్సర్ పేపర్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే
Viral Video
Ravi Kiran
|

Updated on: Jun 25, 2024 | 1:56 PM

Share

మీమ్స్ క్రియేట్ చేయడం ఓ ఆర్ట్. వీటిని ఎప్పటికప్పుడు సరికొత్తగా క్రియేట్ చేసే కంటెంట్ క్రియేటర్ల తెలివిని మెచ్చుకోవాల్సిందే. ఇంటర్నెట్‌లో ఫన్నీ మీమ్స్, రోస్టింగ్ వీడియోలు తరచూ తెగ హల్చల్ చేస్తుంటాయి. ఇదిలా ఉంటే.. ఎగ్జామ్స్‌లో లేదా క్లాస్ టెస్టుల్లో స్టూడెంట్స్ రాసే ఫన్నీ ఆన్సర్స్ కూడా కొన్నిసార్లు మనకు సోషల్ మీడియాలో తారసపడుతుంటాయి. వచ్చిన ప్రశ్నకు ఏం రాయాలో తెలియక.. వాళ్లు రాసే చిత్రవిచిత్రమైన సమాధానాలు.. ఇక ఆ ప్రశ్నాపత్రాలు దిద్దే టీచర్లు స్టన్ అవ్వడం ఖాయం. అలాంటి ఓ క్వశ్చన్ పేపర్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

‘memes-connection’ అనే ఇన్‌స్టా పేజీ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. క్వశ్చన్ పేపర్‌లో మూడు ప్రశ్నలు ఇవ్వగా.. ఈ మూడింటికి కళ్లు చెదిరే ఆన్సర్స్ ఇచ్చాడు ఈ ఆణిముత్యం లాంటి స్టూడెంట్. ముఖ్యంగా పై రెండు ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు పక్కనపెడితే.. మూడో ప్రశ్నకు సమాధానం మరీ పర్సనల్‌గా తీసుకున్నట్టు ఉన్నాడు మనోడు. అదేంటో చూస్తే మీరూ స్టన్ అవ్వడం ఖాయం. ఇంతకీ ఆ ప్రశ్నలు ఏంటంటే..

మొదటి ప్రశ్న: భూమి గుండ్రంగా ఉంటుందని ప్రూవ్ చేయగలరా అని అడిగితే.?

ఆన్సర్: నేను చేయలేను. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుంది అని నేను చెప్పలేదు.

రెండో ప్రశ్న: మనకు సూర్యుడు, చంద్రుడు.. వీరిలో ఎవరు ముఖ్యం.? అని అడగ్గా.?

ఆన్సర్: చంద్రుడు.. ఎందుకంటే రాత్రి చీకటిలోనూ చంద్రుడు మనకు వెలుగునిస్తాడు. పగటిపూట మాత్రమే సూర్యుడు కాంతిని ఇస్తాడు. అయితే మనకు అది అవసరముండదు.

మూడో ప్రశ్న: ఈ మూడింటిలో ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ ఏంటి అని.? a) టెలిఫోన్, b) ఇంటర్నెట్, c) వుమన్ అని మూడు ఒప్షన్స్ ఇవ్వగా..

ఆన్సర్: వుమన్

ఇలా మూడింటికి అదిరిపోయే చక్కటి సమాధానాలు ఇచ్చాడు మన జాతిరత్నం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. సిగ్మా మేల్ అయ్యి ఉంటాడు మన జాతిరత్నం.. మూడో ప్రశ్న కాస్త పర్సనల్‌గా తీసుకున్నాడంటూ కామెంట్ చేశారు చాలామంది.

ఇది చదవండి: వీడురా అసలైన రొమాంటిక్ స్టూడెంట్ అంటే.. ఆన్సర్ పేపర్ చూడగా టీచర్‌కు మైండ్ బ్లాంక్

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే