Viral Video: వీడురా అసలైన రొమాంటిక్ స్టూడెంట్ అంటే.. ఆన్సర్ పేపర్ చూడగా టీచర్‌కు మైండ్ బ్లాంక్

సాధారణంగా పరీక్షల్లో తెలియని సమాధానాలకు ఏదొక సినిమా స్టోరీ రాయడం సర్వసాధారణం. అయితే వీరంతా ఆణిముత్యాలైతే.. ఏకంగా టీచర్‌కు షాకిచ్చే ఆన్సర్స్ రాస్తుంటారు. సరిగ్గా ఆ కోవకు చెందిన ఓ ఆణిముత్యం ఆన్సర్ పేపర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన తర్వాత మీరు కూడా నవ్వాపుకోవడం కష్టం.

Viral Video: వీడురా అసలైన రొమాంటిక్ స్టూడెంట్ అంటే.. ఆన్సర్ పేపర్ చూడగా టీచర్‌కు మైండ్ బ్లాంక్
Student
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 24, 2024 | 5:54 PM

సాధారణంగా పరీక్షల్లో తెలియని సమాధానాలకు ఏదొక సినిమా స్టోరీ రాయడం సర్వసాధారణం. అయితే వీరంతా ఆణిముత్యాలైతే.. ఏకంగా టీచర్‌కు షాకిచ్చే ఆన్సర్స్ రాస్తుంటారు. సరిగ్గా ఆ కోవకు చెందిన ఓ ఆణిముత్యం ఆన్సర్ పేపర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన తర్వాత మీరు కూడా నవ్వాపుకోవడం కష్టం. మనల్ని ప్రేమించిన వారిని మన గుండె నిండా నింపుకుంటూ ఉంటాం. అయితే ఈ యువకుడు ఏకంగా దానికి అడ్డం పెట్టే విధంగా ఆన్సర్ రాసి పెట్టాడు.

‘memes-connection’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఈ వీడియోను నెట్టింట షేర్ చేసింది. క్వశ్చన్ పేపర్‌లో  ‘ గుండె చిత్రాన్ని గీసి.. దాని విధులను విశ్లేషించండి’ అని ఒక క్వశ్చన్ ఇవ్వగా.. ఈ రొమాంటిక్ స్టూడెంట్ ఏకంగా తనదైన శైలిలో సమాధానం రాశాడు. తన హార్ట్ బొమ్మను గీయడమే కాదు.. అందులో ప్రియ, రూప, హరిత, పూజ, నమిత అనే పేరు గల అమ్మాయిలు ఉన్నారని చక్కగా వివరించాడు. ప్రియ అనే అమ్మాయి తనతో ఇన్‌స్టాగ్రామ్ లో చాటింగ్ చేస్తోందని.. ఆ అమ్మాయి అంటే తనకు ఇష్టమని పేర్కొంది. రూప తనతో స్నాప్ చాట్ లో మెసేజ్‌లు చేస్తుందని, చాలా అందంగా ఉంటుందని తెలిపాడు. నమిత తన పొరుగింట్లో ఉంటుందని, ఆమె జుత్తు పొడవుగా, కళ్లు పెద్దగా ఉంటాయని రాసుకొచ్చాడు. పూజ తన మాజీ ప్రేయసి అని ఆమెను మర్చిపోలేకపోతున్నానని చెప్పాడు. ఇక, చివరిగా హరిత తన క్లాస్‌మేట్ అని స్పష్టం చేశాడు.

కాగా, ఈ ఆన్సర్ పేపర్ చూసి కచ్చితంగా టీచర్ ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి కోట్లలో వ్యూస్ వచ్చిపడుతుండగా.. లక్షల్లో లైకులు వచ్చాయి. దీనిని చూసిన నెటిజన్లు పొట్టచక్కలయ్యేలా నవ్వడమే కాకుండా.. కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి వీడియోపై లుక్కేయండి.

ఇది చదవండి: అలెర్ట్.! మీ IRCTC ఐడీతో ఇతరులకు టికెట్ బుక్ చేస్తే.. ఇక జైలుకే

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..