AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs ENG: కోహ్లీ స్థానంలో టీ20 మాన్‌స్టర్.. సెమీస్‌కు ముందుగా టీమిండియాలో కీలక మార్పులు

టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ పోటీ పడుతుండగా.. రెండో మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ తలబడనున్నాయి. గయానా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ కోసం..

IND Vs ENG: కోహ్లీ స్థానంలో టీ20 మాన్‌స్టర్.. సెమీస్‌కు ముందుగా టీమిండియాలో కీలక మార్పులు
Team India
Ravi Kiran
|

Updated on: Jun 26, 2024 | 8:59 AM

Share

టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ పోటీ పడుతుండగా.. రెండో మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ తలబడనున్నాయి. గయానా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కు ముందుగా టీమిండియా జట్టులో కీలక మార్పులు ఉండొచ్చునన్న వార్తలు వస్తున్నాయి.

టోర్నీలో ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పెద్దగా అంచనాలు అందుకోలేదు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో వరుసగా ఫెయిల్ అవుతూనే వచ్చాడు. దీంతో విరాట్ కోహ్లీ స్థానంలో యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోని టీమిండియా.. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో తలబడనుంది. 2022లో ఇదే టీమ్‌తో తలబడిన టీమిండియా.. ఆ టోర్నీలో ఘోర ఓటమిపాలైంది. దీంతో ఈసారి రివెంజ్ తీర్చుకోవాలని కసితో ఉంది రోహిత్ సేన. అందుకే స్ట్రాంగ్ ప్లేయర్స్‌తో బరిలోకి దిగాలని ప్రణాళికలు రచిస్తోంది.

ఓపెనింగ్‌లో కోహ్లీ పూర్తిగా పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. మొన్న ఆసీస్‌పై కూడా విరాట్ డకౌట్ అయ్యాడు. టోర్నీ ఇది అతడికి రెండో డక్. ఇప్పటివరకు కోహ్లీ కేవలం 11 యావరేజ్‌తో కేవలం 66 పరుగులే చేశాడు. కాబట్టి కోహ్లీని ఎప్పటిలానే మూడో స్థానంలో దింపి.. జైస్వాల్‌ను ఓపెనర్‌గా బరిలోకి దింపనున్నారట. ఆల్‌రౌండర్ శివమ్ దూబే స్థానంలో జైస్వాల్ తుది జట్టులోకి వచ్చే అవకాశముందట. ఈ ఒక్క మార్పు మినహా.. మిగతా టీం.. సేమ్ టూ సేమ్ కొనసాగనుంది.

ఇవి కూడా చదవండి

టీమిండియా జట్టు(అంచనా):

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే/యశస్వి జైస్వాల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా

ఇది చదవండి: సెమీస్ ఆడకుండానే ఫైనల్‌కు వెళ్లనున్న టీమిండియా.. ఎందుకో తెలుసా?

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా