AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఇదేం మాస్‌రా మావా.. ఏకంగా దేవుడి పక్కనే మకాం పెట్టేయ్యొచ్చుట.! నమ్మారో ఇక అంతే

చంద్రుడిపై రియల్ ఎస్టేట్ ఇటీవల జోరుగా జరిగింది. చంద్రయాన్ 3 ప్రాజెక్టు విజయవంతమై విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగిన తర్వాత అక్కడి ల్యాండ్ కొని, తమకు ప్రియమైన వారికి బహుమతిగా ఇచ్చే వారి సంఖ్య పెరిగింది. దీనిని స్ఫూర్తిగా తీసుకున్నాడో..

Viral: ఇదేం మాస్‌రా మావా.. ఏకంగా దేవుడి పక్కనే మకాం పెట్టేయ్యొచ్చుట.! నమ్మారో ఇక అంతే
Viral Incident
Ravi Kiran
|

Updated on: Jun 24, 2024 | 5:47 PM

Share

చంద్రుడిపై రియల్ ఎస్టేట్ ఇటీవల జోరుగా జరిగింది. చంద్రయాన్ 3 ప్రాజెక్టు విజయవంతమై విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగిన తర్వాత అక్కడి ల్యాండ్ కొని, తమకు ప్రియమైన వారికి బహుమతిగా ఇచ్చే వారి సంఖ్య పెరిగింది. దీనిని స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో కానీ స్పెయిన్ కు చెందిన ఓ చర్చి పాస్టర్ ఏకంగా స్వర్గంలోనే భూములు అమ్ముతానంటూ ఆన్ లైన్ లో ప్రకటనలు గుప్పించాడు. చదరపు మీటర్‌కు కేవలం వంద డాలర్లేనని చెబుతూ.. స్వర్గంలోని స్పెషల్ ఏరియాలో ఒక్క ప్లాట్ కొనుక్కుంటే సాక్షాత్తూ దేవుడి పక్కనే ఉండొచ్చని ప్రచారం చేశాడు. స్వర్గంలో రియల్ ఎస్టేట్ ఏంటయ్యా అనే వాళ్లకు ఇంకో షాకింగ్ విషయమూ చెప్పాడు. అదేంటంటే.. ఈ దందాకు దేవుడి అనుమతి కూడా ఉందట. 2017లో దేవుడితో జరిగిన ఓ సమావేశంలో తాను ఈ రియల్ ఎస్టేట్ ప్రతిపాదనను ఆయన ముందుంచానని, దీనిని పరిశీలించి దేవుడు ఓకే చెప్పాడని తెలిపాడు.

ఇది చదవండి: అలెర్ట్.! మీ IRCTC ఐడీతో ఇతరులకు టికెట్ బుక్ చేస్తే.. ఇక జైలుకే

స్వర్గంలో ప్లాట్స్ అమ్ముతున్నాం అంటూ సదరు చర్చి ఫాస్టర్ ఓ బ్రోచర్ కూడా ప్రింట్ చేసి జనాలకు పంచాడు. అందులో మేఘాల మధ్యలో ఓ విల్లా, దానిని చేరుకునేందుకు మెట్లగుండా వెళుతున్న ఓ కుటుంబం ఫొటోను అచ్చు వేయించాడు. దేవుడి చెంతనే నివాసం ఉండే అవకాశం.. దీనికి మాది గ్యారంటీ అంటూ నగదు చెల్లించేందుకు రకరకాల ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. అన్ని క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు గూగుల్ పే, యాపిల్ పే వంటి యూపీఐ పేమెంట్ సదుపాయం కూడా ఉందని చెప్పాడు.

స్వర్గంలో భూములు అమ్ముతానని ఫాస్టర్ చెప్పడం సరే, ఆ మాటలు నమ్మేదెవరు, కొనేదెవరు అనుకునేరు.. ఎందుకంటే ఇప్పటికే సదరు పాస్టర్ స్వర్గంలో భూముల అమ్మకం ద్వారా లక్షలాది డాలర్లు ఆర్జించాడట. ఇప్పుడే కాదు, గతంలోనూ ఇలాంటి డీల్ ఒకటి ఉగాండాలో జరిగింది. యూనివర్సల్ అపొస్తొల్ చర్చి ఫాస్టర్ ఫ్రెడ్ ఇసాంగా కూడా ఇలాగే స్వర్గంలో భూములు అమ్ముతానంటూ ప్రకటనలు గుప్పించాడు. దీంతో ఆయన ఫాలోవర్లు కొంతమంది స్వర్గంలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు భూమి మీద తమకున్న ఆస్తులన్నీ అమ్ముకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి జర్నీ
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి జర్నీ
అర్జెంటీనాలో దారుణం.. పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
అర్జెంటీనాలో దారుణం.. పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు