Viral Video: రైలులో చీప్‌గా వచ్చిందని పవర్ బ్యాంక్ కొనేశాడు.. తీరా చూస్తే
సమోసాలు, వాటర్ బాటిల్స్, కూల్‌డ్రింక్స్.. ఇలా ఒకటేమిటి ఆహార పదార్ధాలతో మొదలుపెడితే.. రకరకాల వస్తువుల వరకు అన్నింటిని కూడా రైలు ప్రయాణాల్లో అమ్ముతుంటారు కొందరు విక్రేతలు. ఇప్పటిదాకా రైలులో అమ్మే ఆహార పదార్దాలే నాసిరకంగా ఉంటాయన్న సంగతి పక్కనపెడితే..
సమోసాలు, వాటర్ బాటిల్స్, కూల్‌డ్రింక్స్.. ఇలా ఒకటేమిటి ఆహార పదార్ధాలతో మొదలుపెడితే.. రకరకాల వస్తువుల వరకు అన్నింటిని కూడా రైలు ప్రయాణాల్లో అమ్ముతుంటారు కొందరు విక్రేతలు. ఇప్పటిదాకా రైలులో అమ్మే ఆహార పదార్దాలే నాసిరకంగా ఉంటాయన్న సంగతి పక్కనపెడితే.. కీచైన్లు, చార్జర్లు, పవర్ బ్యాంకులు కూడా ఇదే రీతిలో ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో పలు రైళ్లల్లో సెల్‌ఫోన్ చార్జర్లు, మొబైల్ పవర్ బ్యాంకుల అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. ఇక వాటిని మీరూ కొన్నారంటే.. మోసపోవడం ఖాయమని చెప్పేలా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను ‘im_sankot’ అనే నెటిజన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశాడు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి రైలులో ప్రయాణిస్తున్నాడు. ఇక అప్పుడే అటుగా వచ్చిన ఓ విక్రేతదారుడిని ఆపి.. పవర్ బ్యాంక్ గురించి పరిశీలించాడు. సదరు సేల్స్ పర్సన్ పవర్ బ్యాంక్‌కు పూర్తి గ్యారెంటీ ఇవ్వడంతో పాటు.. ఒకవేళ పాడైతే.. రిటర్న్ బ్యాక్ చేయొచ్చునని చెప్పాడు. ఇక ఆ అమ్మేవాడి దగ్గరున్న పవర్ బ్యాంక్ నాణ్యత ఎలా ఉందో.. చెక్ చేసేందుకు వినియోగదారుడు తీసుకోగా.. దాన్ని ఓపెన్ చేసి చూడటంలో అందులో మట్టి దర్శనమిచ్చింది. ఇలా మీరు వినియోగదారులను మోసం చేస్తున్నారా.? అంటూ వీడియో తీయడంతో భయపడ్డ విక్రేత వెంటనే వీడియో రికార్డింగ్ ఆపాయలంటూ డిమాండ్ చేశాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే దీనికి లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతుండగా.. నెటిజన్లు లైకుల మీద లైకులతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.
पावर बैंक में निकली मिट्टी, सावधान रहें सतर्क रहें 🥺 pic.twitter.com/PiOsJkizCZ
— Sankott (@Iamsankot) June 18, 2024
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..