Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: రూ. 33 కోట్లు గెలిచాడు.. సంతోషంతో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి..

క్యాసినో గ్యాంబ్లింగ్‌లో 4 మిలియన్ డాలర్లు గెలుచుకున్న వ్యక్తి జాక్‌పాట్ కొట్టిన ఉత్సాహంలో గుండెపోటుతో అక్కడికక్కడే మరణించాడు. ఈ షాకింగ్ సంఘటన సింగపూర్‌లోని మెరీనా బే క్యాసినోలో చోటుచేసుకుంది. చేతికి వచ్చిన ఆహారం నోటికి అందాలి.. ఇలా జరగాలంటే తినే మెతుకు మీద మన పేరు రాసి ఉండాలని పెద్దలు చెప్పే విషయం ఈ వ్యక్తీ విషయంలో అక్షరాలా నిజం అయింది. ఆ వ్యక్తికి అదృష్టం కలిసి వచ్చి లక్ష్మీదేవి అనుగ్రహంతో భారీ డబ్బులు ప్రసాదించినా.. అనుభవించే భాగ్యం దక్కలేదు.

Viral News: రూ. 33 కోట్లు గెలిచాడు.. సంతోషంతో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి..
Viral News
Follow us
Surya Kala

|

Updated on: Jun 25, 2024 | 1:12 PM

అదృష్టాన్ని దురదృష్టంగా మార్చడానికి.. జననానికి అయినా మరణానికి అయినా రెప్ప పాటు కాలం చాటు. ఒక్క క్షణంలో బిచ్చగాడు ధనవంతుడు అవుతాడు. అదే సమయంలో అంతవరకూ సంతోషంగా గడుపుతూ భవిష్యత్ కోసం కలలు కనే వ్యక్తీ రెప్ప పాటు కాలంలో మరణిస్తాడు. ఇలాంటి ఘటనలకు సంబందించిన అనేక వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం.. తాజా ఇలాంటి విషాద ఘటనకు సంబంధిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదృష్టం ఉంటేనే ఎవరైనా తాము చేసే పనిలో తేలిగ్గా గెలుస్తారు.. అదే సమయంలో కొన్నిసార్లు అదృష్ట దేవత ముఖం చాటేస్తే దురదృష్టం తలుపు తడుతుంది. ఇందుకు చక్కటి ఉదాహరణగా నిలిస్తుంది తాజాగా జరిగిన సంఘటన. ఓ వ్యక్తికి అదృష్టవశాత్తూ క్యాసినోలో 4 మిలియన్ డాలర్ల (33,38,19,200) జాక్‌పాట్ కొట్టాడు. అంత భారీ మొత్తంలో డబ్బులు గెలిచిన ఆనందం ఎంతో సేపు నిలవకుండా గుండెపోటుతో అక్కడికక్కడే మరణించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

క్యాసినో గ్యాంబ్లింగ్‌లో 4 మిలియన్ డాలర్లు గెలుచుకున్న వ్యక్తి జాక్‌పాట్ కొట్టిన ఉత్సాహంలో గుండెపోటుతో అక్కడికక్కడే మరణించాడు. ఈ షాకింగ్ సంఘటన సింగపూర్‌లోని మెరీనా బే క్యాసినోలో చోటుచేసుకుంది. చేతికి వచ్చిన ఆహారం నోటికి అందాలి.. ఇలా జరగాలంటే తినే మెతుకు మీద మన పేరు రాసి ఉండాలని పెద్దలు చెప్పే విషయం ఈ వ్యక్తీ విషయంలో అక్షరాలా నిజం అయింది. ఆ వ్యక్తికి అదృష్టం కలిసి వచ్చి లక్ష్మీదేవి అనుగ్రహంతో భారీ డబ్బులు ప్రసాదించినా.. అనుభవించే భాగ్యం దక్కలేదు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో ఇక్కడ ఉంది:

ఈ వైరల్ వీడియోలో క్యాసినోలో లాటరీ గెలిచిన ఆనందంలో గుండెపోటుతో మరణించిన వ్యక్తీ కనిపిస్తున్నాడు. అదే సమయంలో ఆ మృత దేహం చుట్టూ కుటుంబ సభ్యులు కూర్చుని దయచేసి లే.. త్వరగా పైకి లే అంటూ తడుతూ బిగ్గరగా ఏడుస్తున్నట్లు చూడవచ్చు. జూన్ 23న షేర్ చేసిన ఈ వీడియో 3 లక్షలకు పైగా వ్యూస్ సాధించగా రకరకాల కామెంట్స్ ను సొంతం చేసుకుంటుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నెట్టింట గత్తరలేపుతోన్న అరుంధతి డ్యాన్స్ టీచర్..
నెట్టింట గత్తరలేపుతోన్న అరుంధతి డ్యాన్స్ టీచర్..
వారి ఇంటి నుంచి దుర్గంధం.. పోలీసులు వెళ్లి చూడగా
వారి ఇంటి నుంచి దుర్గంధం.. పోలీసులు వెళ్లి చూడగా
విమాన ప్రమాదంలో సమస్తం అగ్నికి ఆహుతి ఒక్క భగవద్గీత తప్ప.. వీడియో
విమాన ప్రమాదంలో సమస్తం అగ్నికి ఆహుతి ఒక్క భగవద్గీత తప్ప.. వీడియో
ఒక్కసారే ఇల్లు కట్టాడు.. వాహనాలు కొన్నాడు.. పోలీసులు నజర్ పెట్టగా
ఒక్కసారే ఇల్లు కట్టాడు.. వాహనాలు కొన్నాడు.. పోలీసులు నజర్ పెట్టగా
UPSCలో TV రిపేర్‌మ్యాన్ కొడుకు సత్తా.. ప్రిపరేషన్ సీక్రెట్ తెలుసా
UPSCలో TV రిపేర్‌మ్యాన్ కొడుకు సత్తా.. ప్రిపరేషన్ సీక్రెట్ తెలుసా
భారీ షాకిచ్చిన పసిడి.. రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం ధర
భారీ షాకిచ్చిన పసిడి.. రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం ధర
ఆ స్టార్ హీరో సరసన శ్రీనిధి..
ఆ స్టార్ హీరో సరసన శ్రీనిధి..
ప్రేమ, డబ్బు, మీ సొంతం కావాలా.. గులాబీలతో ఈ చిట్కాలు ట్రై చేయండి
ప్రేమ, డబ్బు, మీ సొంతం కావాలా.. గులాబీలతో ఈ చిట్కాలు ట్రై చేయండి
అక్కతో చివరిసారి మాట్లాడిన ఎయిర్‌హోస్టెస్‌ నగాన్తోయ్‌ శర్మ
అక్కతో చివరిసారి మాట్లాడిన ఎయిర్‌హోస్టెస్‌ నగాన్తోయ్‌ శర్మ
మామిడితోటలో పనిచేస్తున్న కూలీలు..పొదల్లో కనిపించిన సీన్‌ చూసి..
మామిడితోటలో పనిచేస్తున్న కూలీలు..పొదల్లో కనిపించిన సీన్‌ చూసి..