Brahma Kamalam: ఉప్పలగుప్తంలో విరబూసిన బ్రహ్మ కమలం.. మహాశివుడికి నైవేధ్యంగా ప్రత్యేక పూజలు
మహాశివునికి అత్యంత ప్రితిప్రతమైనవి బ్రహ్మ కమలం పుష్పాలు. అందుకే రాత్రి సమయం కావస్తున్నప్పటికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో బ్రహ్మకమలం పూలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ ఇంట్లో పూసిన బ్రహ్మ కమలం పుష్పలను మహశివునికి అందించడం ఎంతో అదృష్టంగాను పుణ్యపలంగా భావిస్తున్నామని శేషగిరి రావు దంపతులు పేర్కొన్నారు.
మహ శివునికి ఎంతో ప్రీతికరమైనవి బ్రహ్మ కమలం పుష్పాలు..హిమాలయాల్లో ఏడాదికి ఒక్కసారే విరిసే బ్రహ్మ కమలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంబేద్కర్ కొనసీమ జిల్లాలో విరబూశాయి. ఉప్పలగుప్తం మండలం సుదాపాలెం గ్రామానికి చెందిన కమిడి శేషగిరిరావు ఇంటి పెరట్లో నాటిని ఈ మొక్కకు పూలు విరబూశాయి. శేషగిరిరావు కుటుంబ సభ్యులు ఎంతగానో సంతోషించారు. తమకు కలిసి వచ్చిన అదృష్టంగా బావించి సమీపంలో శివాలయంలో ఆ పూలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సుదాపాలెం సమీపంలో పొతుకుర్రు గ్రామంలో స్వయంగా వెలసిన శివలింగం వద్దకు వెళ్లి మహశివలింగం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు శేషగిరి రావు కుటుంబ సభ్యులు. మహాశివునికి అత్యంత ప్రితిప్రతమైనవి బ్రహ్మ కమలం పుష్పాలు. అందుకే రాత్రి సమయం కావస్తున్నప్పటికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో బ్రహ్మకమలం పూలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ ఇంట్లో పూసిన బ్రహ్మ కమలం పుష్పలను మహశివునికి అందించడం ఎంతో అదృష్టంగాను పుణ్యపలంగా భావిస్తున్నామని శేషగిరి రావు దంపతులు పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..