How To Get Rid Of Dark Circles: కళ్ల కింద నల్లటి వలయాలా..? కారణాలు, నివారణ మార్గాలు తెలుసుకోండి
కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఎక్కువైనప్పుడు ముఖం రంగు పాలిపోతుంది. కళ్ళు బాగా అలసిపోయినట్లు కనిపిస్తాయి. దీంతో చాలా మంది మానసికంగా కుంగిపోవటం ప్రారంభిస్తారు. కళ్ల చుట్టూ నల్లటి వలయాలు రావడానికి కారణం నిద్రలేమి, అలసట. ఈ నల్లటి వలయాలను తొలగించడానికి కొన్ని ఇంటి నివారణలు ప్రయత్నిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. కళ్ల కింద నల్లటి వలయాలు మీరు అలసిపోయారని సూచించడమే కాకుండా పేలవమైన జీవనశైలి లేదా ఆరోగ్య సమస్యలను కూడా సూచిస్తాయి. నల్లటి వలయాలను నయం చేసే మార్గాలు ఇక్కడ తెలుసుకుందాం..
కళ్ల కింద నల్లటి వలయాలు స్త్రీ పురుషులిద్దరికీ పెద్ద సమస్యగా మారుతుంది. ముఖ్యంగా మీరు ఎంత నిద్రపోయినా, మీ చర్మాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా అవి తగ్గవు. నిద్ర లేకపోవడం, అలసట ఈ నల్లటి వలయాలకు కారణమని అనుకున్నప్పటికీ ఈ సమస్యను తీవ్రతరం చేసే అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. వంశపారంపర్యంగా వచ్చేవి, అలెర్జీలు, వృద్ధాప్యం, చెడు ఆహారపు అలవాట్లు, అలసట, ఎక్కువ టైమ్ స్క్రీన్ చూడటం వంటి అనేక కారణాల వల్ల మీ కళ్ళ క్రింద నల్లటి వలయాలు సాధారణంగా కనిపిస్తాయి. తగినంత నిద్ర లేకపోవడం, సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం, కొన్ని విటమిన్ల లోపం కూడా నల్లటి వలయాలకు కారణం కావచ్చు. ఇది కాకుండా మీ శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల కూడా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. తద్వారా మీరు నిస్తేజంగా కనిపిస్తారు.
డార్క్ సర్కిల్‌లను తొలగించడానికి, లేజర్ థెరపీ, డెర్మల్ ఫిల్లర్స్, బ్లీఫరోప్లాస్టీ, ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.. అలాగే, సన్‌స్క్రీన్, కోల్డ్ కంప్రెస్, అలోవెరా జెల్ ఉపయోగించడం వల్ల పెరుగుతున్న డార్క్ సర్కిల్స్ సమస్యను నివారించడంలో సహాయపడుతుంది.
ఫ్యామిలీ హిస్టరీ, ధూమపానం, ఆల్కహాల్, తక్కువ హిమోగ్లోబిన్, కళ్ళు తరచుగా రుద్దడం, మాత్రలు, పొడి చర్మం, తామర వంటి వైద్య పరిస్థితుల కారణంగా నల్లటి వలయాలు కనిపిస్తాయి. ఇది చర్మంలో వాపు, ఎరుపు, చికాకు కలిగించే దీర్ఘకాలిక వ్యాధి. మన చర్మం వదులుగా మారడం, సబ్కటానియస్ కొవ్వు తగ్గడం వల్ల వయసు పెరిగే కొద్దీ నల్లటి వలయాలు మరింత తీవ్రమవుతాయి. వయసు పెరిగే కొద్దీ చర్మం కొవ్వు కొల్లాజెన్‌ను కోల్పోతుంది. దీని వలన నీలం రక్త నాళాలు కనిపిస్తాయి. ఎక్కువ సేపు ఫోన్ వైపు చూడటం, కళ్లను రుద్దడం, కంటి మేకప్ సరిగా కడుక్కోకపోవడం వల్ల కూడా కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి.
కళ్లకింద నల్లటి వలయాను నివారించేందుకు ఈ టిప్స్ పాటించండి..
– ఆర్గాన్ ఆయిల్‌తో కళ్ల కింద మసాజ్ చేయండి
– మంచి హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్ ఉపయోగించండి
– రాత్రిపూటా సరైన నిద్ర
– కళ్ళను రుద్దడం, నిరంతరం తాకడం మానుకోండి
మెగ్నీషియం చర్మ ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కళ్ళ చుట్టూ ఉబ్బినట్లు తగ్గడానికి సహాయపడుతుంది. సన్‌స్క్రీన్, మాయిశ్చరైజర్ ఉపయోగించండి. ఇవి కాకుండా, ఆరోగ్యకరమైన చర్మం కలిగి ఉండి, కళ్లకింద నల్లటి వలయాలను తగ్గించడానికి హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..